Home రాజకీయాలు చంద్రబాబుకు ట్వీట్టర్‌లో జగన్‌ చాలెంజ్

చంద్రబాబుకు ట్వీట్టర్‌లో జగన్‌ చాలెంజ్

SHARE

పల్నాడులో జరుగుతున్న వేల కోట్ల గనుల దోపిడిపై సీబీఐ విచారణకు చంద్రబాబు సిద్ధమా అని సవాల్ చేశారు వైఎస్‌ జగన్. ట్వీట్టర్లో స్పందించిన జగన్‌… కేసును తప్పుదోవ పట్టించి… వాస్తవాలను కప్పిపుచ్చేందుకే సీఐడీ విచారణకు చంద్రబాబు ఆదేశించారని ఆరోపించారు. అసలైన దోషులను రక్షించేందుకు చంద్రబాబు తన చేతిలో దర్యాప్తు సంస్థకు ఈ కేసును అప్పగించి పెద్ద తప్పును చిన్నతప్పుగా చూపించే ప్రయత‍్నం చేస్తున్నారన్నారు. శాటిలైట్‌ చిత్రాల ఆధారంగా 2014 నుంచి కోటి మెట్రిక్‌ టన్నుల ఖనిజాన్ని దోపిడీ చేసినట్లు తేలుతోందన‍్నారు.

సీబీఐతో విచారణ జరిపిస్తేనే అన్ని నిజాలు బయటకు వస్తాయని.. చినబాబు నుంచి పెదబాబు వరకు అందరి పేర్లు బయటకు వస్తాయన్నారు జగన్.

‘ప్రతీరోజూ కొన్ని వేల లారీలను ఉపయోగించి ఖనిజాన్ని తరలించేశారు. ఇంత వ్యవహారం నడుస్తుంటే ఇన్నాళ్లుగా ఈ విషయం ఎవ‍్వరికీ తెలియదని అనుకోవాలా?. ఎమ్మెల్యే నుంచి చినబాబు, పెదబాబు వరకూ ఈ దోపిడీల్లో భాగస్వాములు కాకుంటే ఇది జరిగేదా?. రాష్ట్రంలో జరుగుతున్న ఏ సహజ వనరులను మిగల్చలేదు. చంద్రబాబు తన చేతిలో ఉన్న సీఐడీతో విచారణ చేయిస్తే ఏం జరుగుతుంది?. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేను నల్లధనంతో కొనుగోలు చేస్తూ ఆడియో, వీడియో టేపులతో దొరికిపోయిన తర్వాత చంద్రబాబు అన్న మాటలను ఈ సందర్భంగా గుర్తు తెచ్చుకోవాలి. మీకూ ఏసీబీ ఉంది. మాకూ ఏసీబీ ఉంది. మీకూ సీఐడీ ఉంది.. మాకు సీఐడీ ఉంది. మీకూ డీజీపీ ఉన్నాడు. మాకూ డీజీపీ ఉన్నాడు’ అని చంద్రబాబు వ్యాఖ్యానించిన విషయాన్ని ట్వీట్టర్ ద్వారా విడుదల చేసిన లేఖలో జగన్‌ గుర్తు చేశారు.