Home సినిమా టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ వుంది: ఆర్ఎక్స్ పాయల్!

టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ వుంది: ఆర్ఎక్స్ పాయల్!

SHARE

సినిమాల్లో అవకాశాలు ఇస్తా౦ అంటూ అమ్మాయిలను పడగ్గదికి పిలిపించుకోటం 100 శాతం నిజ౦ అని ‘ఆర్ఎక్స్ 100’ తో ఓ సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్న అందాల రాసి ముద్దుగుమ్మ పాయల్ రాజ్ పుత్ తెలిపారు. కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న టాలీవుడ్ పై పాయల్ ఈ సంచలన వ్యాఖ్యలు చేసారు.

ఆర్ ఎక్స్ సినిమా లో తాను బోల్డ్ గా కనిపించినందువల్ల తాను ఎటువంటి వాటికైనా వెనుకాడనని….అలాంటి బాపతు అమ్మాయిని అనుకునీవుంటారేమోనని చెప్పిన పాయల్, జస్ట్ నాలుగు రోజుల క్రితమే తనను కాంప్రమైజ్ కావాలంటూ ఒకరు ప్రపోసల్ తీసుకొచ్చారని చెప్పారు.

తాను తెలియపరుస్తున్న ఈ మాటలను కచ్చితంగా ప్రచురించాలని కోరుతూ “ఐయామ్ రియల్లీ షాక్డ్. ఇటువంటి ప్రపోసల్తో ఒకరు నా ముందుకు వచ్చారు. నేను ఒకటే చెప్పాలి అనుకుంటున్నా. నేను కాంప్రమైజ్ అయి ఈ స్థాయికి చేరుకోలేదు. నేను నా టాలెంట్ తోనే ఎదిగాను…నేను చెప్పదలచుకున్నది అదే” అంటూ చెప్పారు.

తన జీవితంలో ఎప్పుడూ కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదని కుండబద్దలు కొట్టారు పాయల్ రాజ్ పుత్. అయితే ఈ ప్రపోసల్ తెచ్చిన వ్యక్తి పేరు మాత్రం ఈ భామ వెల్లడించకుండా ఉండటం గమనార్హం!