Home Uncategorized ఎటిఎం సంస్కరణ…ఎటిఎం టైం లలో పెను మార్పులు!

ఎటిఎం సంస్కరణ…ఎటిఎం టైం లలో పెను మార్పులు!

25
SHARE

సెక్యూరిటీ కారణాల దృష్ట్యా ఎటిఎమ్ లలో నోట్ల భర్తీ పై కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ ఆంక్షలు విధించారు. ఈ ఆంక్షలు వచ్చే సంవత్సరం నించి అమల్లోకి వస్తాయి. పెద్ద నగరాల్లోని ఏటీఎం సెంటర్లలో రాత్రి 9దాటిన తర్వాతా…అలానే గ్రామీణ ప్రాంతాల్లోని ఏటీఎం లలో సాయంత్రం 6గంటలు దాటిన తర్వాత నగదు నింపటం జరగదు.

జిల్లా కేంద్రాల్లో అయితే ఉదయం 9గంటలకు ముందు, సాయంత్రం 4గంటలు దాటిన తర్వాత ఏటీఎం లలో నగదును నింపే పద్దతి కి స్వస్థి పలకనున్నారు.

ఒక వేళ ఏటీఎంలో నగదు ఖాళీ అయితే మరుసటి రోజు వరకూ ఆగాల్సిందే. ఈ కొత్త నిబంధన వచ్చే సంవత్సరం నించి అమల్లోకి వస్తుంది…..అలాగే నగదు రవాణా లో కూడా పాటించవలసిన నిబందనలు రూపొందించారు. మన డబ్బు మనకి కావాలన్నపుడు తీసుకునే వీలు కోసం ఎటిఎం లు వెలిశాయన్నది నిజం….కానీ ఎటిఎం టైమింగ్స్ కి తగ్గట్టు మన డబ్బు అవసరాలు మార్చుకోవాలనేది ఎటిఎం సంస్కరణలు చెబుతున్న విషయం!