Home రాజకీయాలు ఏపీ బాండ్లు కొన్న వారు ఎవరు…??

ఏపీ బాండ్లు కొన్న వారు ఎవరు…??

483
SHARE

డోన్ ఎంఎల్ఏ, ఆంధ్ర ప్రదేశ్ పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాద్ రెడ్డి ఎపి బాండ్ల గురించిన బాగోతాన్ని బట్ట బయలు చేశారు. ఈ రోజు మీడియాతో మాట్లాడిన బుగ్గన స్వతంత్ర దినోత్సవ సంబరాలని కూడా పక్కన పెట్టి ఏపీ బాండ్లు అంటూ ప్రజలను ఎపి ప్రబుత్వం మోసం చేస్తోందని అన్నారు. బాండ్లు అంటే అదేదో ఊరికే వచ్చిన డబ్బు అన్నట్టు ప్రచారం చేస్తోందని బుగ్గన పెదవి విరిచారు.

ఎక్కడా లేని విదంగా 10.75 శాతం వడ్డీ కి బాండ్ల పేరున అప్పులు చేశారని, ఇందులో పెట్టుబడి పెట్టినవారిలో తొమ్మిది మంది పెట్టుబడి దారులు ఉన్నారని, వారి పేర్లు ప్రభుత్వం వెల్లడించాలని బుగ్గన డిమాండ్ చేశారు.

దేశంలో ఎన్నో బాండ్లు వచ్చాయని, కాని ఇలా 10.75శాతం ఇచ్చే బాండ్లు ఇవే అని…ఇది రాష్ట్ర ఆర్ధిక స్థితిని మరింత భారం చేయనుందని అన్నారు. తొలుత ఆరు శాతం వడ్డీ కి మించి బాండ్లు ఇవ్వకూడదని ప్రభుత్వం జీఓ ఇచ్చిందని అయితే దానిని మార్చి ఇప్పుడు ఏకంగా 10.75 శాతం వడ్డీ కి ఎలా తీసుకున్నారని బుగ్గన ప్రశ్నించారు.

అధికార తెలుగు దేశం మోసం చేస్తుంటే, ఓ వర్గం మీడియా బాద్యతారాహిత్యం తో ప్రభుత్వానికి అనుకూల ప్రచారం చేయడం అన్యాయం అంటూ బుగ్గన పేర్కొన్నారు. రాజదాని అమరావతి, రాష్ట్ర అప్పులు పెరిగిన చందం పై కూడా బుగ్గన ప్రభుత్వ తీరును ఎండగట్టారు!!