Home రాజకీయాలు తెలంగాణ లో ఎవరితో పవన్ పొత్తు??

తెలంగాణ లో ఎవరితో పవన్ పొత్తు??

SHARE

జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలంగాణలో శాసనసభ ఎన్నికల నగారా మోగించారు అనుకోవాలి. పవన్ కళ్యాణ్ అధ్యక్షతన పార్టీకి చెందిన తెలంగాణ ముఖ్యనేతలు, పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు చర్చలు జరిపారు.

తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా పోటీ చేయడానికి పార్టీ శ్రేణుల్ని సన్నద్ధం చేయాలని పవన్ కళ్యాణ్ నేతలకు దిశా నిర్దేశం చేశారు. తెలంగాణ లో పార్టీ కోఆర్డినేషన్ కమిటీ, గ్రేటర్ హైదరాబాద్ కమిటీ లను కూడా కొద్ది రోజులలో ప్రకటించనున్నట్లు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. కోఆర్డినేషన్ కమిటీ, జిల్లా కమిటీల నియామకాలు కూడా ప్రారంభిస్తామని ఇది రెండు మూడు వారాల్లో పూర్తి చేస్తామని తెలిపారు.

పార్టీ శ్రేణుల్ని ఎన్నికలకు తయారు చేయటంలో నిమగ్నం అవుదామని పవన్ సూచించారు. తెలంగాణ లో అన్ని నియోజకవర్గాలలో పోటీ చేయాలని నేతలు విజ్ఞప్తి చేయగా, ఆ విషయం పై కొద్దీ రోజుల్లో చర్చించి నిర్ణయిద్దామని చెప్పారు.

తెలంగాణ లో కనీసం పదిహేను లక్షల మంది పార్టీ సభ్యత్వం తీసుకునేలా కృషి చేయాలని పవన్ సూచించారు. సెప్టెంబర్ నెలలో జనసేన పార్టీ కార్యకర్తలతో భారీ సభ నిర్వహించాలని కూడా ఈ సమావేశం నిర్ణయించింది. హైదరాబాద్ లో జరగనున్న సభకు సమాయత్తం అవ్వాలని పార్టీ నేతలకు పవన్ సూచించారు.