Home రాజకీయాలు టీవీ9ను కొనేసిన మేఘా సంస్థ

టీవీ9ను కొనేసిన మేఘా సంస్థ

SHARE

చాలా కాలంగా టీవీ9 సంస్థను కొనుగోలు చేసేందుకు పలు మీడియా సంస్థలు పోటీ పడ్డాయి. ఎట్టకేలకు టీవీ9 అమ్మకం పూర్తయినట్టు తెలుస్తోంది. నిర్మాణ రంగంలో అగ్రగామిగా నిలిచిన మేఘా సంస్థ టీవీ9ను కొన్నట్టు చెబుతున్నారు. ఒప్పందం కూడా పూర్తియినట్టు కంపెనీ సన్నిహిత వర్గాల సమాచారం.

సెప్టెంబర్‌లో టీవీ9 సంస్థ పూర్తిగా మేఘా చేతికి రానుందని తెలుస్తోంది. మేఘా సంస్థల అధినేత కృష్ణారెడ్డికి ఎన్‌టీవీలోనూ భాగస్వామ్యం ఉంది. తాజాగా టీవీ9 చానల్‌ కొనుగోలు వెనుక మేఘా సంస్థల అధినేత కృష్ణారెడ్డి వ్యక్తిగత అవసరాలేమీ లేవని చెబుతున్నారు. ఆత్మీయుల సూచనలు సలహాలు కూడా కృష్ణారెడ్డి టీవీ9 కొనుగోలుకు కారణమై ఉంటాయని చెబుతున్నారు.