Home రాజకీయాలు వరద భీభత్స౦తో అల్లాడిపోతున్నకేరళ కు ‘మెగా’ సాయం!!

వరద భీభత్స౦తో అల్లాడిపోతున్నకేరళ కు ‘మెగా’ సాయం!!

SHARE

వరద భీభత్స౦తో అల్లాడిపోతున్నకేరళని ఆదుకోవడానికి యావత్ భారత దేశం ముందుకు వస్తోంది. ప్రతి ఒక్కరు తమకి తోచినంత సాయం కేరళ కి పంపుతూ తమ దేశభక్తి చాటుకుంటున్నారు. మెగా కుటుంబం నించి ముందుగా అల్లు అర్జున్ 25లక్షలు తన వంతు సాయం కేరళా కి ప్రకటించారు. ఇప్పుడు వరద భీభత్సం తో అల్లాడుతున్న ప్రజలను ఆదుకోవడానికి ప్రముఖ నటుడు, మాజీ కేంద్ర మంత్రి చిరంజీవి, ఆయన కుటుంబం ముందుకు వచ్చింది.

మెగా స్టార్ చిరంజీవి రూ.25లక్షలు, రామ్‌చరణ్‌ రూ.25 లక్షలు, రామ్‌చరణ్‌ సతీమణి ఉపాసన కూడా తన వంతు సహాయంగా రూ.10లక్షల విలువైన మందులు విరాళం గా ఇస్తున్నట్లు తెలిపారు. తమిళనాడు కు చెందిన పలువురు నటీ, నటులు కూడా విరాళాలు ఇస్తున్నారు.

దేశ వ్యాప్తంగా కేరళ వరద భీభత్సం పై సానుభూతి వ్యక్తం అవుతోంది. సాయం చేయాలనుకునేవారు ఇక్కడ ఇచ్చిన లింక్ ద్వారా ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ కి చేయవచ్చు- https://donation.cmdrf.kerala.gov.in/