Home రాజకీయాలు దుర్గమ్మ ఆలయంలో వెలగపూడి బాబు లైంగిక వేధింపులు

దుర్గమ్మ ఆలయంలో వెలగపూడి బాబు లైంగిక వేధింపులు

SHARE

గతంలో ఎన్నడూ లేని విధంగా విజయవాడ దుర్గమ్మ ఆలయంలో వ్యవహారాలు వివాదాస్పదమవుతున్నాయి. లోకేష్‌కు అదనపు శక్తుల కోసమంటూ ఏకంగా ఆలయంలో తాంత్రిక పూజలు చేశారన్న ఆరోపణలు అప్పట్లో సంచలనం సృష్టించాయి.

ఆ తర్వాత చీరల వ్యవహారం భక్తులను కలవరపాటుకు గురి చేసింది. ఇప్పుడు ఏకంగా పవిత్రమైన అమ్మవారి ఆలయంలో మహిళలపై లైంగిక వేధింపుల అంశం సంచలనంగా మారింది. స్వయంగా పాలకమండలి మాజీ సభ్యురాలు కోడెల సూర్యలత ఈ విషయాలు చెప్పారు.

పాలకమండలి సభ్యుడు వెలగపూడి శంకర్‌బాబు.. ఆలయంలో పనిచేసే మహిళల ఉద్యోగులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని ఆమె వెల్లడించారు.  శంకర్‌బాబు లైంగిక వేధింపులపై ఐదుగురు మహిళా ఉద్యోగులు పాలకమండి చైర్మన్ గౌరంగబాబుకు లిఖితపూర్వకంగా కూడా ఫిర్యాదు చేశారని కానీ శంకర్‌బాబును చైర్మన్ వెనుకేసుకొచ్చి లైంగిక ఫిర్యాదులను తొక్కిపెట్టారని చెప్పారు.

సీసీ రోడ్డు నిర్మాణంలో 9కోట్లు నొక్కేశారని చెప్పారు. ఘాట్ రోడ్డు పనుల్లో మూడు కోట్ల రూపాయలను కాజేశారని వివరించారు. లైంగిక వేధింపులు, అవినీతిపై ప్రశ్నించినందుకే తనపై చీరల దొంగ అంటూ ముద్రవేసి సస్పెండ్ చేశారని సూర్యలత అరోపించారు.