Home రాజకీయాలు జగన్ నర్సీపట్నం సభ…వైకాపా శ్రేణులకు కొత్త ఉత్సాహం!!

జగన్ నర్సీపట్నం సభ…వైకాపా శ్రేణులకు కొత్త ఉత్సాహం!!

SHARE

విపక్ష నేత వైస్ జగన్ ప్రజాసంకల్ప యాత్ర ఈ రోజు విశాఖ జిల్లా కి అడుగుపెట్టింది. నర్సీపట్నం లో జగన్ పాదయాత్ర మొదలుపెట్టారు. నర్సీపట్నం లో బహిరంగ సభ కి వరుణుడు తీవ్ర అడ్డంకి అయ్యాడు. అయినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ అదినేత సభ విజయవంతం అయింది. వాన పడుతున్నాలెక్క చేయకుండా వేలాది మంది జనం నిలబడి జగన్ ప్రసంగాన్ని వినడం, హర్షద్వానాలతో జగన్ వ్యాఖ్యలకు స్పందించడం విశేషం.

వాన కారణంగా జగన్ తన ప్రసంగాన్ని తొందరగానే ముగించినా జనం మాత్రం జగన్ వెళ్లేవరకు ఉండి ఆయన అబివాదాలకు ప్రత్యాభివాదాలు చేస్తూ ఆశీర్వదించారు. కొంత మంది గొడుగులతో సభలో పాల్గొనగా, చాలా మంది మాత్రం తడుస్తూనే ప్రసంగాన్ని విన్నారు.

జగన్ ఈ సందర్భంగా అబద్దాలు ఆడే నాయకులు కావాలా…లేక మోసాలు చేసే నాయకులు కావాలా తేల్చుకోవాలని ప్రజలతో అన్నారు. జగన్ ప్రసంగానికి ప్రజలు స్పందించి సభను విజయవంతం చేశారు.

విశాఖపట్నం జిల్లాలో ఇదే జగన్ తొలి సభ …ఇది ఇంతలా విజయవంతం అవడం పై వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు శ్రేణులు ఉత్సాహం వెలిబుచ్చారు.