Home రాజకీయాలు నారా లోకేష్ వన్ పీస్…జండా వందనం ఎక్కడంటే..!

నారా లోకేష్ వన్ పీస్…జండా వందనం ఎక్కడంటే..!

77
SHARE

ఒక పక్క దేశమంతా జై భారత్ మాట నినాదం తో నిన్న స్వాతంత్ర దినోత్సవం పండగ చేసుకొన్నారు. పేద నించి గొప్ప వరకు తమకు తోచిన విధంగా జండా పండగ చేసుకున్న వేళ…రాజకీయ నేత లు మాత్రం చాలా బిజీ బిజీ గా గడిపారు. జండా ఎగరవేయటం లాంటి ప్రోగ్రాములతో గడిపారు.

లోకేష్ కూడా జెండా ఎగురవేశారు. కానీ…భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను దేశవ్యాప్తంగా ప్రజలు ఘనంగా జరుపుకుంటున్న వేళ, లోకేశ్ తన నివాసంలో జెండా ఎగరవేసారట. ఆ విషయం వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి తెలియచేస్తూ మంత్రిని ఎద్దేవా చేశారు.

దీని పై తన ట్విట్టర్ ఖాతాలో విజయసాయి రెడ్డి ఓ పోస్టు పెట్టారు. “ఈ దేశంలో ఆగస్టు 15 సందర్భంగా తన ఇంటిపై జెండాను ఎగురవేసిన ఏకైక మంత్రి లోకేష్ నాయుడు మాత్రమే. ఈ కార్యక్రమంలో పోలీసులు కూడా పాల్గొని వందనం సమర్పించారు. అధికారాన్ని దుర్వినియోగం చేయడమంటే ఇదే”

పోస్ట్ తు పాటుగా లోకేష్ సెల్యూట్, పోలీసుల గౌరవ వందనం సమర్పిస్తున్న ఫొటో లను విజయసాయి తన ట్విట్టర్ లో షేర్ చేశారు. అధికార దుర్వినియోగానికి విజయసాయి రెడ్డి షేర్ చేసిన ఫోటో లు గొప్ప సాక్ష్యం!!