Home రాజకీయాలు జగన్ కాపుల అంశం రాజకీయాలకు వాడుకోలేదు అనటానికి సాక్ష్యం!!

జగన్ కాపుల అంశం రాజకీయాలకు వాడుకోలేదు అనటానికి సాక్ష్యం!!

SHARE

పీ లో అత్యంత సున్నితమైన కాపు ల అంశం పై వివిధ పార్టీలు చివరికి వైకాపా అదినేత జగన్ పంధా లోకే వస్తున్నట్లు వుంది. జనసేన అదినేత పవన్ కళ్యాణ్ తాజా ప్రకటన అదే స్పష్టం చేస్తుంది. పవన్ కళ్యాణ్ ఆచంట లో జరిగిన సభలో తన ప్రసంగంలో అటు బిసిలను, ఇటు కాపులను ఎవ్వర్నీ దూరం చేసుకోకుండా మాట్లాడడానికి ప్రయత్నించారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు కులాల మద్య చిచ్చు పెట్టారని, ఇక అలా చేయొద్దని కోరుతున్నానని ఆయన అన్నారు. కానీ 2014 ఎన్నికల ముందు చంద్రబాబుతో కాపుల రిజర్వషన్ అంశం గురించి ప్రస్తావించిన పవన్ ఇదెలా సాధ్యమవుతుందని అడిగారట. కానీ బాబు సాధ్యమే అని చెప్పి పవన్ ను మభ్య పుచ్చారట.

కానీ నాలుగేళ్ల వరకు ఈ విషయం గుర్తుకు రాని పవన్ కు ఈ విషయం ఇప్పుడు జగన్ ప్రస్తావించిన తరువాత గుర్తుకు వచ్చింది.

మరి బాబు తో కలిసి నడిచిన పార్టీలకు ఈ పాపం లో వాటా ఉందా లేదా? బాబు అబ్బద్దలు చెప్పి గెలిచినా ఫర్వాలేదని పవన్ అనుకున్నారని అనుకోవాలా?

ముద్రగడ పద్మనాభం కాపు ఉద్యమమప్పుడు ,కాపులకు అవమానాలు ఎదురైనప్పుడు, వారిని అరెస్టులు చేసి జైళ్లలో పెట్టినప్పుడు కుక్కినప్పుడు వైకాపా అండగా ఉంది…అసలు పవన్ కళ్యాణ్ ఇంకా సినిమాలు చేసుకుంటున్నారు …ఇప్పుడేమో బాబు కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని అంటున్నారు.

అసలు టిడిపి మానిపెస్టో గురించి పవన్ పట్టించుకోకుండానే మద్దతు ఇచ్చారంటే అది తప్పే కదా..ఇప్పుడేమో రిజర్వేషన్ లు ఏభై శాతం మించి ఉండరాదని రాజ్యంగం చెబుతోందని పవన్ అంటున్నారు. అప్పుడు ఈ విషయం పై జ్ఞానం లేదా?

కాపులకు రిజర్వేషన్ లు ఇవ్వాలన్నదే తమ వైఖరి అని, కానీ తాను అబద్దాలు ఆడనని, చేయగలిగిందే చెబుతానని జగన్ అనటం ఓ పెద్ద తప్పుగా చూపించే ప్రయత్నాన్ని టిడిపి నేతలు పవన్ కళ్యాణ్ చేశారు.

యనమల రామకృష్ణుడు కూడా ఏభై శృతం రిజర్వేషన్ ల పరిమితి గురించి చెప్పారు, ఇప్పుడేమో పవన్వ కూడా ఆ విషయం చెబుతున్నారు. సో జగన్ రాజకీయంగా కాపుల అంశాన్ని వాడుకోలేదని అర్దం అవుతుంది. విపక్ష నేత నిజాయితీ గా చెప్పడాన్ని కూడా అబినందించాలి.