Home రాజకీయాలు ఈ నీచత్వం చంద్రబాబు అలవాటే…

ఈ నీచత్వం చంద్రబాబు అలవాటే…

273
SHARE

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీరుపై నటుడు పోసాని కృష్టమురళీ మరోసారి ధ్వజమెత్తారు. రాజకీయం కోసం మహిళలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయించడం చంద్రబాబు అలవాటేనన్నారు. అప్పట్లో టీడీపీ కోసం విశేషంగా సేవలు అందించిన జయప్రదను కూడా చివరకు అవమానకరంగా పార్టీ నుంచి బయటకు పంపించారన్నారు.

ఎన్టీఆర్‌నుంచి పార్టీని లాక్కుని ఆయన మరణానికి కారణమైన చంద్రబాబు నిందను మాత్రం మహిళ అయిన లక్ష్మీపార్వతిపైకి వేశారన్నారు. టీడీపీ పనిచేసినప్పటికీ వైసీపీలో చేరిన తర్వాత రోజాపై దారుణమైన పదాలతో మాట్లాడిస్తున్నారని అన్నారు.

ఇలాంటి చంద్రబాబు వైఎస్ భారతీపై కేసులు పెట్టించినా ఆశ్చర్యం లేదన్నారు. 90 శాతం మీడియాను, కులాన్ని అడ్డుకుపెట్టుకుని చంద్రబాబు తనకు అనుకూలంగా కథనాలు రాయించుకుంటుకున్నారని విమర్శించారు. మహిళలను మానసికంగా చంపాలంటే మాటలు… శారీరకంగా చంపాలంటే మరో మార్గం అనుసరించడం చంద్రబాబుకు, టీడీపీ నేతలకు అలవాటేనన్నారు.