Home రాజకీయాలు మాజీ ప్రధాని వాజపేయి ఇక లేరు!

మాజీ ప్రధాని వాజపేయి ఇక లేరు!

144
SHARE

భారత మాజీ ప్రధాని, అపార రాజకీయ భీష్ముడు, భారతీయ జనతా పార్టీ కురు వృద్ధుడు శ్రీ అటల్ బిహారీ వాజపేయి కొన్ని నిమిషాల క్రితం తుది శ్వాస విడిచారు.

వాజపేయి మరణాన్ని ఎయిమ్స్ వైద్యాధికారులు అధికారికంగా ధృవీకరించిన పిదప ప్రకటించారు. గడిచిన తొమ్మిది వారాలు ఆసుపత్రిలో మరణం తో పోరాడి అలిసిన మాజీ ప్రధాని చివరకు తుదిశ్వాస విడిచారు.

వాజపేయి మరణవార్త తో యావత్ భారత దేశం దు:ఖసాగరంలో మునిగిపోయింది. ఆయన వయసు 93 సంవత్సరాలు. అజన్మాన్తమ్ బ్రహ్మచారిగా ఉన్న వాజపేయి… నమిత అనే ఆడపిల్లని దత్తత తీసుకుని, పెంచారు. వాజపేయి మరణంతో ఢిల్లీ లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. మరోవైపు, వాజపేయి నివాసం వద్దకు ప్రధాని మోదీ, బీజేపీ నేతలు చేరుకున్నారు. పలువురు రాజకీయ నేతలు వాజపేయి మరణానికి దిగ్భ్రాఅంతి కి లోనయ్యారు.

వాజపేయి కి మాత్రమే భాజపా ని కాంగ్రెస్ కి ప్రత్యామ్నాయం గా మలిచిన క్రెడిట్ దక్కుతుంది. అయన మరణానికి చింతిస్తూ….అయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాం!!