Home రాజకీయాలు వైఎస్ భారతీ తియ్యటి మనసుకు నిదర్శనం- చిరంజీవి

వైఎస్ భారతీ తియ్యటి మనసుకు నిదర్శనం- చిరంజీవి

449
SHARE

వైఎస్ భారతీ తనకు సోదరి లాంటి వారన్నారు మెగాస్టార్ చిరంజీవి. సాక్షి ఎక్స్‌లెన్స్ అవార్డ్స్-2017కు సంబంధించి బెస్ట్ హీరో అవార్డును మెగాస్టార్ చిరంజీవి అందుకున్నారు.

అవార్డు ఫంక్షన్‌కు రాలేకపోయిన చిరంజీవికి అవార్డును ఆయన ఇంటి వద్ద సాక్షి పెద్దలు రామచంద్రమూర్తి, ప్రియదర్శిని రాం అందజేశారు. సైరా సినిమా షూటింగ్‌లో బిజీగా ఉండడం వల్లే అవార్డు ఫంక్షన్‌కు రాలేకపోయానని చిరంజీవి చెప్పారు.

అయినప్పటికీ వైఎస్ భారతీ తన మీద అభిమానంతో అవార్డును అందజేసినందుకు ఆనందంగా ఉందన్నారు. వైఎస్ భారతీ తనకు సోదరిలాంటి వారని… అవార్డుతో పాటు చాక్లెట్‌ బాక్స్‌ కూడా పంపించారని.. ఇది ఆమె తియ్యటి మనసుకు నిదర్శనమని వ్యాఖ్యానించారు.

గతంలో తాను సాక్షి ఎక్స్‌లెన్స్ అవార్డు కార్యక్రమాల్లో పాల్గొన్నానని చిరు గుర్తు చేశారు. స్వాతంత్య్ర సమర యోధుడు ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ జీవితగాధ ఆధారంగా తీస్తున్న సినిమా సైరా… దేశం యావత్తూ గర్వించే గొప్ప సినిమాగా చరిత్రలో నిలిచిపోతుందన్నారు చిరంజీవి.