Home రాజకీయాలు విజయ్ ఘాట్ లో వాజపేయి పేరుతో రాష్ట్రీయ స్మృతి స్థల్

విజయ్ ఘాట్ లో వాజపేయి పేరుతో రాష్ట్రీయ స్మృతి స్థల్

48
SHARE

మాజీ ప్రదాని అటల్ బీహారీ వాజ్ పేయి మరణం పై అనేక మంది రాజకీయ వేత్తలు, రాజకీయానికి అతీతులైన సామాన్యులు ఎందరో నివాళులు అర్పిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, విపక్ష నేత వైస్ జగన్, జన సేన అధినేత పవన్ కళ్యాణ్ ట్విట్టర్ లో తమ నివాళులు అర్పించారు.

రాజకీయాల్లో అజాత శత్రువు అయిన వాజపేయి అంత్యక్రియలు యమునానది ఒడ్డున నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. ఆ నది ఒడ్డునే రాష్ట్రీయ స్మృతి స్థల్ నిర్మించాలని కూడా నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

దీని నిర్మాణం నిమిత్తం పాత నిబంధనల మార్పు కోసం అవసరమైన ఆర్డినెన్స్ ను తీసుకురానున్నట్టు వార్త. రాష్ట్రీయ స్మృతి స్థల్ నిర్మాణానికి గాను విజయ్ ఘాట్ లో 1.5 ఎకరాల భూమిని కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. ఈ మేరకు పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ అత్యవసర ఉత్తర్వులు జారీ చేసింది.

వాజ్ పేయి మృతదేహాన్ని రేపు 11 గంటలకు భాజపా కార్యాలయానికి తీసుకెళ్లి సాయంత్రం ౪ వరకు ప్రజల సందర్శనార్ధం ఉంచుతారు. అటు పిమ్మట అంత్యక్రియలు సాయంత్రం నాలుగు గంటలకు యమునా నది ఒడ్డున నిర్వహిస్తారు.

కేంద్రం వారం రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించింది. రేపు దిల్లీలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించారు. దాదాపుగా 12రాష్ట్రాలు రేపు సెలవు ప్రకటించాయి. పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు రేపు పని చేయవు.