Home రాజకీయాలు వెలిగొండ ప్రాజెక్ట్ కోసం వైసీపీ నేత పాదయాత్ర

వెలిగొండ ప్రాజెక్ట్ కోసం వైసీపీ నేత పాదయాత్ర

40
SHARE

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత నాలుగేళ్లు గా వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేయకుండా, తాత్సారం చేస్తున్నారని…అవసరమైన నిదులు కేటాయించకుండా, వ్యయం చేయకుండా, ఎన్నికల సంవత్సరం వచ్చేసరికి ఏడాది లో అయిపోతుందని ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఒంగోలు వైకాపా నేత మాజీ ఎమ్.పి వైవి సుబ్బారెడ్డి అన్నారు.

అంతేకాదు వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేయాలని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఆయన పాదయాత్ర చేపట్టారు. మొత్తం 200 కి.మీ.పాదయాత్రను ఆయన పదిహేను రోజులలో చేయ నున్నారు.

మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, సజ్జల రామకృష్ణా రెడ్డి జెండా ఊపి వై వీ సుబ్బారెడ్డి పాదయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా సుబ్బారెడ్డి మాట్లాడుతూ ప్రకాశం జిల్లా ఇంత వరకు కూడా ఎలాంటి అభివృద్ధికీ నోచుకోలేదని, జిల్లాలో కరువు విలయ తాండవం చేస్తోందని వాపోయారు. జిల్లా లో త్రాగునీరు, సాగునీరు సమస్య తీరాలని, వెలిగొండ ప్రాజెక్టు తో ఈ సమస్య తీరనుందని ఆయన పేర్కొన్నారు. జగన్ నేతృత్వంలో వైకాపా అధికారంలోకి వస్తే కనక ఏడాదిలోపు వెలిగొండ ప్రాజెక్టు పూర్తి అవుతుందని సుబ్బారెడ్డి ఆశాభావం వ్యక్త౦ చేశారు.