Home రాజకీయాలు లేటెస్ట్ సర్వే చూసి మూర్చబోతున్న పార్టీలు..

లేటెస్ట్ సర్వే చూసి మూర్చబోతున్న పార్టీలు..

SHARE

ఎన్నికలు దగ్గరపడే కొద్దీ సర్వేల సందడిపెరుగుతోంది. ప్రతి మీడియా సంస్థ సర్వేలు వడ్డిస్తోంది. అయితే ఒక సంస్థకు మరో సంస్థకు మధ్య సర్వేల్లో పొంతన ఉండడం లేదు. తాజాగా ప్రముఖ జాతీయ టీవీ చానల్‌ టైమ్స్ నౌ ఒక సర్వేను ప్రసారం చేసింది.

ఓవరాల్‌గా ఏపార్టీకి ఎన్ని సీట్లు వస్తాయన్న దానిపై చానల్ చెప్పిన సంఖ్య నమ్మసక్యంగానే ఉన్నా… ఏపీలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయన్న దానిపై ఆ చానల్ సర్వే చూసి జనం నమ్మలేకపోతున్నారు.

ఏపీకి వెన్నుపోట్లు పొడిచిన బీజేపీకి, కాంగ్రెస్‌కు ఏపీలో ఒక అసెంబ్లీ సీటు వచ్చినా గొప్పే అని భావిస్తుంటే… సదరు చానల్ మాత్రం బీజేపీకి ఏకంగా ఏడు ఎంపీ సీట్లు వస్తాయని చెప్పేసింది.

మొన్నటి ఎన్నికల్లో ఖాతా తెరవని కాంగ్రెస్‌కు ఏకంగా మూడు ఎంపీ స్థానాలు వస్తాయట. ఇక వైసీపీ, టీడీపీ, మిగిలిన పార్టీలు మిగిలిన 15 సీట్లను పంచుకోవాల్సి ఉంటుందని తేల్చిసింది.

ఈ సర్వేను చూసి నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. బీజేపీకి ఏపీలో ఏడు ఎంపీ సీట్లా… ఎవరు బాబు ఈ సర్వే చేసింది అంటూ ప్రశ్నిస్తున్నారు. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేస్తే ఏడు సీట్లు రావొచ్చు అంటూ ఎద్దేవా చేస్తున్నారు.