Home రాజకీయాలు వైసీపీపై మీడియా ఫీల్డింగ్ స్ట్రాటజీ

వైసీపీపై మీడియా ఫీల్డింగ్ స్ట్రాటజీ

SHARE

టీడీపీ అనుకూల మీడియా చానళ్లు వేస్తున్న విన్యాసాలను కాంగ్రెస్ నేత రవిచంద్రారెడ్డి బయటపెట్టారు. ఇటీవల టీడీపీ అనుకూల టీవీ చానళ్ల నుంచి తనకు ఎదురైవుతున్న అనుభవాలను ఆయన వివరించారు. రాజకీయ నాయకుల కుటుంబాల్లోని మహిళలు, కుటుంబసభ్యులపై చర్చ పెట్టడం సరికాదన్నందుకు తనను ఒక టీడీపీ చానల్ చర్చకు పిలువకుండా బ్యాన్ చేసిందని చెప్పారు.

వైఎస్ కుటుంబంలోని ఆడవాళ్లను మీడియా టార్గెట్‌ చేస్తుండడంతో … అది పద్దతి కాదని రవిచంద్రారెడ్డి చెప్పడంతో ఆయన్ను చర్చలకు పిలవకుండా బ్యాన్ చేసింది చానల్. రవిచంద్రారెడ్డిపై బ్యాన్ వేసిన విషయం తెలియని యాంకర్ మరోసారి ఆయన్ను చర్చకు పిలిచారు. ఈ విషయం తెలుసుకున్న చానల్ ఎండీ నేరుగా యాంకర్‌కు ఫోన్ చేసి అతడు టీడీపీకి వ్యతిరేకంగా గట్టిగా మాట్లాడుతాడు.. కాబట్టి అతడిని చర్చలకు పిలవకూడదని నిర్ణయించాం కదా.. మళ్లీ ఎందుకు పిలిచావ్ అంటూ ప్రశ్నించారని రవిచంద్రారెడ్డి వివరించారు.

చర్చకు టీడీపీ నుంచి బలంగా వాదించే వ్యక్తిని పిలిచి ఇతర పార్టీల నుంచి గట్టిగా మాట్లాడలేని వారిని పిలుస్తారని రవిచంద్రారెడ్డి చెప్పారు.   చర్చకు వచ్చే విశ్లేషకుడిని కూడా టీడీపీకి అనుకూలంగా ఉండేవారినే ఎంపిక చేసుకుంటారని వెల్లడించారు.

ప్రతిపక్షాన్ని టార్గెట్‌ చేసే తతంగానికి ఫీల్డింగ్ అనే పేరు పెట్టుకున్నట్టు ఒక యాంకరే తనకు చెప్పారన్నారు.  చర్చలో టీడీపీకి అనుకూలంగా ఆ పార్టీ ప్రతినిధి, విశ్లేషకుడు, యాంకర్‌ ముగ్గురూ కలిసి వ్యవహరిస్తుంటారని రవిచంద్రారెడ్డి బయటపెట్టారు.