Home సినిమా విజయ్ నుంచి ఇది ఊహించలేదు: ‘గీత గోవిందం’పై రాజమౌళి

విజయ్ నుంచి ఇది ఊహించలేదు: ‘గీత గోవిందం’పై రాజమౌళి

SHARE

విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘గీత గోవిందం’ చిత్రం ఈ రోజు విడుదలై మంచి టాక్ తో ఊపందుకుంది. మంచి టాక్ తెచ్చుకున్న ఈ సినిమా పై టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు రాజమౌళి తనదైన స్టైల్ లో స్పందించారు. ఓ ట్వీట్ రూపంలో తన అభిప్రాయం తెలియచేశారు.

ఈ సినిమా ఓ నవ్వుల రేడని విజయ్ దేవరకొండ నుంచి అస్సలు ఊహించ లేని సినిమా అని రాజమౌళి అన్నారు. ‘అర్జున్ రెడ్డి’ తర్వాత ఇటువంటి చిత్రం విజయ్ దేవరకొండ కి బెస్ట్ ఛాయిస్ అని. విజయ్ కి , తాను ఏం చేస్తున్నాడో స్పష్టంగా తెలుస ని కొనియాడారు.

గీత గోవిందం చిత్రం ఆద్యంతం సరదా సన్నివేశాల తో కూడి ఉందని, దర్శకుడు పరశురామ్ ఎంతో బాగా తెరకెక్కించాడని రాజమౌళి ప్రశంసించారు. రాజమౌళి అంతటి దర్శకుడి నుంచి మెప్పుపొందడం విజయ్ అదృష్టమే. ఇంతకన్నా గీత గోవిందం సినిమా కి మరో బూస్ట్ అక్కర్లేదు!!