Home రాజకీయాలు జనసేన మౌనమేలా?

జనసేన మౌనమేలా?

124
SHARE

గుంటూరు జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్‌ అక్రమమైనింగ్‌పై సీఐడీ విచారణను వైసీపీ ఇన్‌చార్జ్ కాసు మహేష్ తప్పుపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో ఉన్న సీఐడీతో విచారణ జరిపిస్తే నిజాలు బయటకు వచ్చే అవకాశమే లేదన్నారు.

సీబీఐ విచారణ చేయించాలన్నారు. . ఇప్పటికే సీఐడీ అగ్రిగోల్డ్ కుంభకోణం విషయం ఏమీ సాధించలేకపోవడాన్ని అందరం చూశామన్నారు. యరపతినేనిని కాపాడేందుకు గురజాలలో రోజుకో నాటకాన్ని తెరపైకి తెస్తున్నారని మహేష్ అన్నారు.

కుంభకోణంపై విచారణ జరిపిస్తే యరపతినేని ఇంటి దగ్గర మొదలై అది చంద్రబాబు ఇంటి గడప వద్ద ఆగుతుందన్నారు. అందుకే సీబీఐ విచారణకు చంద్రబాబు భయపడుతున్నారన్నారు. వైసీపీ నిజనిర్దారణ కమిటీ మరో పది రోజుల్లో మైనింగ్ ప్రాంతానికి వెళ్లి తీరుతుందన్నారు.

పోలీసులు అనుమతించకపోకపోతే హైకోర్టుకు వెళ్తామన్నారు. యరపతినేని ఎలా మేనేజ్‌ చేశారో గానీ కాంగ్రెస్, బీజేపీ, జనసేన మాత్రం యరపతినేని అక్రమాలపై స్పందించడం లేదని కాపు మహేష్ విమర్శించారు.