Home రాజకీయాలు టీడీపీకి పద్మశ్రీ పొత్తు షరతు…

టీడీపీకి పద్మశ్రీ పొత్తు షరతు…

479
SHARE

సిద్దాంతాలు సిగ్గుకు వదిలి… నీతి సంగతికి నీటిని వదిలి .. కలిసిపోతే ఎంత బాగుంటుందో అని కాంగ్రెస్‌, టీడీపీ రెమాంటిక్‌ సాంగ్స్‌ పాడుకుంటున్నాయి. టీడీపీతో పొత్తుకు రాహుల్ గాంధీ సిగ్నల్ ఇచ్చిపోవడంతో ఇక అల్లుకుపోయేందుకు ఏపీ కాంగ్రెస్‌ నేతలు సిద్ధమవుతున్నారు.

నిన్నటి వరకు చంద్రబాబు అవినీతిపరుడు, ఈ దుర్మార్గపు పాలనకు చరమగీతం పాడాలని ఘోషించిన కాంగ్రెస్ గొంతులు ఇప్పుడు కొత్త రాగం కోసం గొంతు సవరించుకుంటున్నాయి.

టీడీపీతో పొత్తుపై మాట్లాడిన తులసీరెడ్డి… రాహుల్ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటామని చెప్పారు. బీజేపీ దుష్టపరిపాలన నుంచి ప్రజలకు విముక్తి కలిగించడమే తమ ప్రధాన లక్ష్యమని చెప్పారు. నిన్నటి వరకు చంద్రబాబు పాలనను అంతమొందించాలన్న తులసీరెడ్డి ఈసారి మాత్రం బీజేపీకే పరిమితమయ్యారు.

కాంగ్రెస్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ మరో అడుగు ముందుకేసి కాంగ్రెస్‌- టీడీపీ కాపురం సజావుగా సాగాలంటే ఏం చేయాలో సలహాలు కూడా ఇస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో అవినీతిపరులకు టీడీపీ సీట్లు ఇవ్వొద్దు అని కోరిక కోరారు.

నిన్న వరకు చంద్రబాబే వేల కోట్లు దోచేస్తున్నారని విమర్శించిన గొంతులే .. ఇప్పుడు అవినీతిపరులకు టికెట్లు ఇవ్వొద్దని చంద్రబాబుకే సూచించడం రాజకీయ వైపరిత్యమే.