Home రాజకీయాలు గురజాల మైనింగ్ అక్రమాల్లో వీరిద్దరూ కూడా భాగస్వాములే!

గురజాల మైనింగ్ అక్రమాల్లో వీరిద్దరూ కూడా భాగస్వాములే!

SHARE

గుంటూరు జిల్లా గురజాల లో జరుగుతున్న మైనింగ్ మాఫియా లో తెదేపా ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు పాత్ర బలంగా ఉందని విపక్ష నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.అయితే ఎంఎల్ఏ తో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన కుమారుడు మంత్రి లోకేష్ కు కూడా సంబందం ఉందని వైసీపీ అదికార ప్రతినిది అంబటి రాంబాబు ఆరోపించారు.

గురజాల మైనింగ్ అక్రమాల పై సిబిఐ విచారణ జరిపించాలని అంబటి డిమాండ్ చేశారు. అధికారులు కూడా అక్రమార్కులకు సహకరి౦చినట్టు నిరూపణ జరిగితే తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు.

సీఐడీ విచారణతో నిజాలు బయటికి వచ్చే అవకాశం తక్కువ కావున సీబీఐ విచారణ చేయించాల్సిందే అని అంబటి చెప్పారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నడికుడి, కొనంకి, కేసానుపల్లి గ్రామాల్లో యరపతినేని టన్నుల కొద్దీ ముడి ఖనిజాన్ని తవ్వటమే కాకుండా ప్రభుత్వానికి రాయల్టీ ఎగ్గొట్టి అక్రమాలకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు.

అక్రమ మైనింగ్‌ లో న్యాయం కోసం కోర్టు మెట్లెక్కిన వారిపై యరపతినేని అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని, అందుకే మాజీ ఎమ్మెల్సీ టీజీవీ కృష్ణా రెడ్డి పై ఆరు అక్రమ కేసులు పెట్టారని ఆయన చెప్పారు.