Home రాజకీయాలు ఆగస్ట్ 15న రిపబ్లిక్‌ డే శుభాకాంక్షలు

ఆగస్ట్ 15న రిపబ్లిక్‌ డే శుభాకాంక్షలు

SHARE

ఏపీ ప్రభుత్వ యంత్రాంగం పనితీరు నవ్వులపాలవుతోంది. ఏపీ ప్రభుత్వ అధికార వెబ్‌సైట్‌లో అధికారుల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. ఆగస్ట్‌ 15న ఇండిపెండెన్స్ డేకి బదులు రిపబ్లిక్‌ డే జరిపేశారు.

ప్రజలకు శుభాకాంక్షలు చెబుతూ వెబ్‌సైట్‌లో జాతీయ జెండాను ఉంచారు. అయితే జాతీయ జెండాపై రిపబ్లిక్‌ డే అని ప్రచురించారు.

ఆగస్టు 15న రిపబ్లిక్‌ డే అని చెప్పడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఇండిపెండెన్స్‌ డే… రిపబ్లిక్‌ డేకు తేడా తెలియకుండా పనిచేస్తున్నారా అని ఫైర్ అవుతున్నారు. అయినా జయంతి, వర్థంతికి తేడా తెలియకుండానే మంత్రులవుతున్నప్పుడు ఇదేంతా?.