Home రాజకీయాలు సెల్ఫీ పాయింటే అభివృద్ధి ఎట్టా అవ్వుద్ది బాబు??

సెల్ఫీ పాయింటే అభివృద్ధి ఎట్టా అవ్వుద్ది బాబు??

SHARE

విజయవాడ లోని ప్రకాశం బ్యారేజ్ వద్ద ‘మన అమరావతి’ అనే సెల్ఫీ పాయింట్ ను సీఎం చంద్రబాబునాయుడు ప్రారంభించారు. కృష్ణా ఘాట్ వద్ద ఈ సెల్ఫీ పాయింట్ ను ఏర్పాటు చేశారు. అంతే కాదు సెల్ఫీలకు చిరునామాగా ఈ ‘మన అమరావతి’ సెల్ఫీ పాయింట్ ఉంటుందని అన్నారు.

వచ్చే ఐదు, పదేళ్ల సంవత్సరాలలో అమరావతి ని అత్యుత్తమ నగరంగా నిలుపుతామని హామీ ఇచ్చారు బాబు. ఈ సందర్భంగా అమరావతి బాండ్ల గురించి కూడా ముఖ్యమంత్రి ప్రస్తావించారు. ఈ బాండ్లకు వచ్చిన స్పందన ఎంతో అద్భుతమని కొనియాడారు చంద్రబాబు.

ఈ స్పందన తన పరిపాలనా పారదర్శకతకు నిదర్శనమంటూ తనని తాను ప్రశంసించుకున్నారు. రైతులు కూడా తమ ప్రభుత్వానికి ఎంతో అండగా నిలుస్తున్నారని బాబు సంతోషం వ్యక్తం చేశారు. హైకోర్టు భవనాల నిర్మాణానికి టెండర్లు పిలిచామని, త్వరలోనే శాశ్వత అసెంబ్లీ నిర్మాణ పనులను ప్రారంభిస్తామని చెప్పారు. డిసెంబర్ నాటికి అమరావతి రూపురేఖలు మారిపోతాయని చంద్రబాబు అన్నారు.

సెల్ఫీ పాయింట్ లు అభివృద్ధా బాబు? అయినా డిసెంబర్ కి మరో నాలుగు నెలలున్నాయి…అంతలోనే రూపురేఖలు ఎలా మారి పోతాయబ్బా?