Home రాజకీయాలు మందు నిషేధం పై జన సేనాని విజనేమిటో ?

మందు నిషేధం పై జన సేనాని విజనేమిటో ?

SHARE

జన సేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తన విజన్ డాక్యుమెంట్ ను కొద్దిసేపటి క్రితం విడుదల చేశారు. భీమవరం లో నిర్వహించిన కార్యక్రమంలో పవన్ విజన్ని విడుదల చేశారు. అందులో ఆయన పన్నెండు హామీలు ఇచ్చారు.

మహిళలకు 33శాతం రిజర్వేషన్లు, బిసి వర్గాలకి అవకాశాన్ని బట్టి 5శాతం రిజర్వేషన్ ల పెంపుదల, కాపు లకు రిజర్వేషన్లు తొమ్మిదో షెడ్యూల్ లో చేర్చే అంశం పై జన సేన ప్రయత్నం, మహిళల కు రేషన్ కి బదులుగా ప్రతి నెలా 2500రూపాయల నగదు బదిలీ వంటివి మొదలైనవి ఈ విజన్ లో పొందుపరిచారు. ప్రభుత్వ ఉద్యోగులకు సీపీఎస్‌ విధానం రద్దు చేయడం, ఎస్సీ వర్గీకరణ కు సామరస్య పరిష్కారం, ముస్లింల అభివృద్ధికి సచార్‌ విధానం అమలు చేయటం, అగ్రవర్ణాల్లోని పేద విద్యార్థులకు వసతి గృహాలు, అగ్రవర్ణాల్లోని పేదల అభివృద్ధికి కార్పొరేషన్ ల ఏర్పాటు ఇందులో చేర్చారు.

అయితే మహిళల సంక్షేమం అన్న జన సేన…మందు పై ఎందుకు విజన్ పెట్టలేదా అని రాజకీయ వర్గాల్లో చర్చలు. మహిళాభ్యుదయం లో మందు నిషేధం అతి ప్రధాన మైన పాత్ర పోషిస్తుంది అనడం లో సందేహం లేదు. బెల్ట్ షాపుల గురించి విమర్శలు చేస్తున్న పవన్ మందు ని నిషేధిస్తారా లేదా అన్నది ప్రస్తుతానికి
సస్పెన్స్ అనే చెప్పాలి