Home రాజకీయాలు దటీజ్ కాంగ్రెస్‌… రేవంత్ కు రవ్వంతరెడ్డి హోదా

దటీజ్ కాంగ్రెస్‌… రేవంత్ కు రవ్వంతరెడ్డి హోదా

SHARE

కాంగ్రెస్‌లో చేరే సమయంలో రేవంత్ రెడ్డి చేసిన హడావుడి అంతా ఇంతాకాదు. తనను తాను బాహుబలిగా ప్రచారం చేసుకున్నాడు. కానీ కాంగ్రెస్‌ అంటే ఏంటో ఇప్పుడు రేవంత్ రెడ్డికి తెలిసి వచ్చింది. కాంగ్రెస్ తనను రవ్వంత రెడ్డిగానే గుర్తిస్తున్న విషయం రాహుల్ పర్యటనలో రేవంత్‌కు స్పష్టంగా అర్థమైంది.

హైదరాబాద్‌లో పార్టీ సీనియర్లతో రాహుల్ సమావేశానికి రేవంత్ రెడ్డికి అవకాశం ఇవ్వలేదు. సీనియర్ల జాబితాలో రేవంత్ రెడ్డి పేరు లేదు. అయినప్పటికీ ఎలాగైనా పాస్‌ సంపాదించాలని రేవంత్ రెడ్డి చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. దీంతో రేవంత్ రెడ్డి అవమానభారంతో ఉన్నారు.

రేవంత్ రెడ్డికే కాదు .. జానారెడ్డి, షబ్బీర్ అలీ, సునీతాలక్ష్మారెడ్డికి కూడా రాహుల్‌తో భేటీ సీనియర్ల జాబితాలో చోటు దక్కలేదు. సీఎల్పీ నేత కావడంతో రాహుల్ సమావేశానికి జానారెడ్డి రాగా… పేరు లేదంటూ రాహుల్ భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు.

దీంతో జానారెడ్డి, షబ్బీర్ అలీ అవమానభారంతో తిరిగి వెళ్తుండగా సీనియర్లు జోక్యం చేసుకుని బుజ్జగించారు. రాహుల్‌తో భేటీకి అవకాశం దక్కకపోయే సరికి సునీత లక్ష్మారెడ్డి కన్నీరు పెట్టుకున్నారు.

మరోవైపు ఉస్మానియా వర్శిటీ విద్యార్థులతో రాహుల్‌ గాంధీ భేటీ రద్దైంది. ఒక హోటల్లో భేటీ ఏర్పాటు చేయగా… రాహుల్ గాంధీ రాకముందే విద్యార్థులు రెండు గ్రూపులుగా విడిపోయి కొట్టుకున్నారు. దీంతో సమావేశం రద్దైంది.