Home రాజకీయాలు ఏపీలో వైసీపీ స్ట్రోక్‌ ఎలా ఉందో ఒప్పుకున్న రాహుల్

ఏపీలో వైసీపీ స్ట్రోక్‌ ఎలా ఉందో ఒప్పుకున్న రాహుల్

SHARE

ఏపీలో కాంగ్రెస్ పరిస్థితిని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అంగీకరించారు. ఏపీలో తమ పార్టీకి తిరుగులేదని.. బీభత్సమైన బలం ఉందని మాట వరుసకైనా చెప్పలేకపోయారు. హైదరాబాద్‌లో ఎడిటర్లతో జరిగిన సమావేశంలో ఏపీలో కాంగ్రెస్‌  పూర్తిస్థాయిలో పుంజుకోని మాట వాస్తవమేనన్నారు.

కేవలం ఓట్ల శాతం మాత్రమే పెరిగిందని రాహుల్ అంగీకరించారు. 2014కు ముందు వరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ తిరిగి 2019లో ఏపీలో సత్తా చాటుతుందని కూడా రాహుల్ గాంధీ ధీమాగా చెప్పలేకపోయారు. అదే సమయంలో టీడీపీతో పొత్తుకు సంకేతాలిచ్చారు.

టీడీపీతో పొత్తు ప్రతిపాదనను రాహుల్ తోసిపుచ్చలేదు. కలిసి వచ్చే పార్టీలతో కలిసి వెళ్తామని చెప్పారు. పీసీసీ నుంచి ప్రతిపాదన వస్తే టీడీపీతో పొత్తు అంశాన్ని పరిశీలిస్తామని రాహుల్ చెప్పడం ద్వారా టీడీపీతో పొత్తుకు స్పష్టమైన సంకేతాలిచ్చారు.

తెలంగాణలో మాత్రం అధికారంలోకి వస్తామని ధీమాగా చెప్పారాయన. 2019లో మోడీని ప్రధాని కాకుండా చేయడమే తమ లక్ష్యమన్నారు . బీజేపీకి 230కి మించి సీట్లు రాకపోతే మోడీ ప్రధాని కాలేరన్నారు.

అప్పుడు బీజేపీ మోడీని కాకుండా మరొకరిని ప్రధానిగా ప్రతిపాదిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు రాహుల్. మహిళా రిజర్వేషన్లకు తాము కట్టుబడి ఉన్నామన్న రాహుల్.. కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న తెలంగాణ ముస్లిం రిజర్వేషన్ల బిల్లుపై మాత్రం స్పందించకుండా దాటవేశారు.