Home రాజకీయాలు ఎన్టీఆర్ 60 ఏళ్ళు ఆగితే పవన్ కి తొందరెందుకు?

ఎన్టీఆర్ 60 ఏళ్ళు ఆగితే పవన్ కి తొందరెందుకు?

95
SHARE

ముఖ్య‌మంత్రి ప‌ద‌వి గురించి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ స్పందన పై పలు రకాల కామెంట్స్ వినపడుతున్నాయి. నిన్న ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా నిడ‌ద‌వోలులో జ‌రిగిన ప్ర‌జాపోరాట యాత్ర‌లో పాల్గొన్న పవన్ జ‌న‌సేన సిద్ధం చేయ‌బోతున్న మేనిఫెస్టో గురించి చెప్పి తమ మేనిఫెస్టో లో అన్ని వ‌ర్గాల‌కూ న్యాయం చేస్తామ‌న్నారు.

నారా లోకేష్ ని ఉద్దేశించి… ‘తను ముఖ్యమంత్రి కావాలంటే అరవయ్యేళ్లు ఆగాలి అన్నారు. 60 ఏళ్లు సినీ ప‌రిశ్ర‌మ‌లో క‌ష్ట‌ప‌డి పేరు సంపాయించుకుని అప్పుడు ఎన్టీఆర్ ముఖ్య‌మంత్రి అయ్యార‌ని గుర్తు చేశారు. తాను ప్ర‌జాస‌మ‌స్య‌ల‌పై పోరాడుతున్నాన‌నీ, కోట్లు సంపాదించుకునే అవ‌కాశం ఉన్న సినీ రంగాన్ని వ‌దిలేసి రాజ‌కీయాల్లోకి వ‌చ్చాన‌ని అన్నారు.

ఎన్టీఆర్ ఎంతో క‌ష్ట‌ప‌డి ముఖ్య‌మంత్రి అయితే, ఆయన్ని వెన్నుపోటు పొదవటం ద్వారా చంద్ర‌బాబు నాయుడు సీఎం అయ్యారన్న విషయం లోకేష్ గుర్తుంచుకోవాల‌ని చెప్పారు. అయితే ముఖ్య‌మంత్రి పదవి పై ప‌వ‌న్ వైఖ‌రి ఎప్పటికప్పుడు మారుతూ వచ్చింది.

ముందేమో తనకి ముఖ్యమంత్రి అవ్వాలన్న ఆశ లేదు అన్నారు …పోను పోను తాను కాలేను అని అన్నారు …ఇక జన సైనికులు పవన్ సీఎం సీఎం అని అనడం నుంచి సీఎం ప‌ద‌వి ఎంతో భారమైంది… క‌ష్ట‌మైంది….బాధ్య‌త‌లతో కూడిన పదవి…అనుభ‌వం కావాలి అన్నారు. అయితే ఈ మధ్య స్వరం మారి ప్రజల సమస్యలు అర్థం చేసుకున్న తను సీఎం అవ్వాలి అన్నారు.

ఇక 2004 నుంచి తను రాజ‌కీయాల్లో ఉన్నాన‌ని, ప‌దేళ్ల‌ పైబ‌డి రాజకీయ అనుభ‌వం త‌న‌ సొంతం అంటున్నారు. 2014 ఎన్నిక‌ల్లో జన సేన పోటీ చేయ‌క‌పోవ‌డం త‌ప్పు అని ఒప్పుకుంటున్నారు. మరీ ఈ మధ్య జ‌న‌సేన ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌స్తే ….అంద‌రికీ న్యాయం అంటూ…తానే ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థిని అని స్వ‌యంగా ప్ర‌క‌టించేసుకుంటున్నారు…లోకేష్ ముఖ్య‌మంత్రి కావాలంటే అర‌వ‌య్యేళ్లు ఆగాలి….జగన్ కి ముఖ్య మంత్రి అయ్యే అర్హతే లేదు….కానీ తాను మాత్ర౦..??