Home ప్రత్యేకం బంధం మరింత బలపడింది… రాహుల్‌తో బ్రహ్మణి భేటీ

బంధం మరింత బలపడింది… రాహుల్‌తో బ్రహ్మణి భేటీ

SHARE

బీజేపీ, కమ్యూనిస్టులతో పలుమార్లు, టీఆర్‌ఎస్‌తో ఒకమారు, జనసేనతో ఒకసారి పొత్తు పూర్తి చేసి ఆ తర్వాత విడాకులు ఇచ్చిన చంద్రబాబు.. ఇక మిగిలిన కాంగ్రెస్‌తోనూ పొత్తుకాపురానికి దాదాపు సిద్ధమయ్యారు.

కొత్తదనం కోరుకుంటున్న కాంగ్రెస్‌ కూడా చంద్రబాబుతో కాపురానికి సై అంది. అప్పటి నుంచి పలుమార్లు ఒకరిపై ఒకరు ప్రేమను చాటుకునేందుకు కాంగ్రెస్‌, టీడీపీలు అవకాశం దొరికినప్పుడల్లా ప్రయత్నిస్తున్నాయి. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు టీడీపీ మద్దతు ఇవ్వడం ద్వారా తమ ప్రేమను బహిరంగంగానే చంద్రబాబుప్రదర్శించారు.

ఈ నేపథ్యంలో అధికారిక పొత్తు ప్రకటన మాత్రమే మిగిలి ఉందని చెబుతున్నారు. తాజాగా హైదరాబాద్‌ పర్యటనకు వచ్చిన రాహుల్‌తో చంద్రబాబు కోడలు నారా బ్రహ్మణి  సమావేశం అవడం చర్చనీయాంశమైంది.

పారిశ్రామికవేత్తలలో తాజ్‌కృష్ణలో రాహుల్ సమావేశం ఏర్పాటు చేయగా… గంట ముందే నారా బ్రాహ్మణి వెళ్లారు.  టీడీపీ ఎంపీల కుమారులు జేసీ పవన్‌, టీజీ భరత్‌తోపాటు దగ్గుపాటి సురేష్‌ కూడా రాహుల్‌ను కలిశారు.

అనుకున్న సమయానికంటే గంట ముందే  రాహుల్‌ భేటీకి నారా బ్రాహ్మణి వచ్చారు. కాంగ్రెస్‌, టీడీపీ మధ్య బంధం మరింత బలపడిందని చెప్పేందుకు ఈ పరిణామాలే నిదర్శనమని అభిప్రాయపడుతున్నారు.