Home రాజకీయాలు ఎంపి శివప్రసాద్‌పై తమన్నా ఫిర్యాదు

ఎంపి శివప్రసాద్‌పై తమన్నా ఫిర్యాదు

SHARE

పార్లమెంట్‌ వద్ద రోజుకో వేషం వేస్తూ వినోదాన్ని పంచుతున్న టీడీపీ ఎంపీ శివప్రసాద్ చిక్కుల్లో పడ్డారు. వేమన వేషం మాత్రమే వేయని శివప్రసాద్ ఇటీవల ట్రాన్స్ జెండర్ వేషం కూడా కట్టారు. సోనియా గాంధీ నుంచి ఆ వేషానికి కితాబు కూడా పొందారు.

అయితే ఎంపీ శివప్రసాద్ ఇలా ట్రాన్స్ జెండర్ వేషం వేయడాన్ని ట్రాన్స్‌జెండర్లు అవమానకరంగా భావిస్తున్నారు.టీడీపీ ఎంపీ ట్రాన్స్ జెండర్‌గా వేషం వేయడాన్ని ట్రాన్స్ జెండర్లు అంగీకరించడం లేదు. టీడీపీ ఎంపీ ట్రాన్స్‌జెండర్ వేషం వేసి తన మనోభావాలను దెబ్బతీశారంటూ ట్రాన్స్ జెండర్‌ అసోసియేషన్ ప్రతినిధి తమన్నా సింహాద్రి విజయవాడ గవర్నర్‌పేట పీఎస్‌లో ఫిర్యాదు చేశారు.

వేషధారణతో టీడీపీ ఎంపీ తమను కించపరిచారని.. ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ లిఖితపూర్వకంగా తమన్నా ఫిర్యాదుచేశారు. ఒక ఎంపీ అయి ఉండి ఇలా ఇతరుల మనోభావాలను దెబ్బతీసేలా.. అది కూడా పార్లమెంట్ ముందు వేషాలు వేయడం ఏమాత్రం సరికాదని తమన్నా హితవు పలికారు.