Home రాజకీయాలు జనసేన విజన్ మేనిఫెస్టో విడుదల..

జనసేన విజన్ మేనిఫెస్టో విడుదల..

177
SHARE

జనసేన పార్టీ తన విజన్ మేనిఫెస్టోను విడుదల చేసింది. ఏడు సిద్ధాంతాలు, 12 హామీలను మేనిఫెస్టోలో ప్రకటించింది. కులాలను, రిజర్వేషన్లను బేస్‌ చేసుకుని వాటిని తయారు చేశారు. జనసేన హామీల్లో క్లిష్టమైన రిజర్వేషన్లకు సంబంధించిన హామీలే నాలుగు ఉన్నాయి.

జనసేన ప్రకటించిన సిద్ధాంతాలు..

1. కులాలను కలిపే ఆలోచనా విధానం

2. మతాల ప్రస్తావన లేని రాజకీయం

3. భాషలను గౌరవించే సంప్రదాయం

4. సంస్కృతులను కాపాడే సమాజం

5. ప్రాంతీయతను విస్మరించని జాతీయవాదం

6. అవినీతిపై రాజీలేని పోరాటం

7. పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం

జనసేన ఇచ్చిన 12 హామీలు…

1. మహిళలకు 33శాతం రాజకీయ రిజర్వేషన్లు

2. గృహిణులకు ఉచితంగా గ్యాస్‌ సిలిండర్లు

3. రేషన్‌కు బదులు మహిళల ఖాతాల్లో రూ.2500-3500 మధ్య నగదు జమ

4. బీసీలకు అవకాశాన్ని బట్టి రాజకీయంగా 5శాతానికి రిజర్వేషన్ల పెంపు

5. చట్టసభల్లో బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు

6. కాపులకు 9వ షెడ్యూల్‌ ద్వారా రిజర్వేషన్ల కల్పన

7. ఎస్సీ వర్గీకరణకు సామరస్య పరిష్కారం

8. ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాల వారికి కార్పోరేషన్‌

9. ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాల విద్యార్థులకు వసతిగృహాలు

10. ముస్లింల అభివృద్ధికి సచార్‌ కమిటీ విధానాలు అమలు

11. ప్రభుత్వ ఉద్యోగులకు సీపీఎస్‌ విధానం రద్దు

12. వృద్ధుల కోసం ప్రభుత్వ ఆశ్రమాలు

ప్రస్తుతం తాము విడుదల చేసింది విజన్ డాక్యుమెంట్ మాత్రమేనని జనసేన వెల్లడించింది. తమ మేనిఫెస్టోలోకి కొన్ని మచ్చుతునకలు మాత్రమే ఇవి అని వివరించింది.