Home రాజకీయాలు మోడీ షా లకు ఈసీ ఝలక్!!

మోడీ షా లకు ఈసీ ఝలక్!!

SHARE

పార్లమెంటుకు, రాష్ట్రాల అసెంబ్లీల అన్నిటికి ఎన్నికలు ఒకేసారి నిర్వహించాలనే సూచన బీజేపీ చీఫ్ అమిత్ షా చేసి విషయం తెలిసిందే. ఈ సూచనపై ఎన్నికల కమిషన్ (ఈసీ) స్పందించింది. జమిలి ఎన్నికలు అనేవి భారతదేశం లో సాధ్యం కాదని, ఒకేసారి ఎన్నికల నిర్వహణకు అవసరమయ్యే సాధనా సంపత్తి మనకి ఇంకా లేదని ఈసీ పేర్కొంది. వచ్చే ఏడాది లోక్‌సభ ఎలెక్షన్స్‌ తో బాటు వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను కూడా నిర్వహించ జాలమని ప్రధాన ఎన్నికల కమిషనర్ ఓపి రావత్ తెలిపారు.

జమిలి ఎన్నికలకు సరిపడినన్ని వీ వీ పాట్ యంత్రాలు ఈ సి వద్ద లేవన్నారు. ఏక కాల ఎన్నికల నిర్వహణపై నిర్ణయాన్ని రెండు నుంచి మూడు నెలల్లోగా తీసుకోవలసి ఉంటుంది. అయితే వీ వీ పాట్ యంత్రాల కోసం ముందే ఆర్డర్ ఇవ్వాలి….మళ్ళీ అవి టైం కి అందుతాయా లేదా అన్నది సందేహమే అని రావత్ అభిప్రాయ పడ్డారు. జమిలి ఎన్నికల వల్ల ఖర్చు భారం చాలా తగ్గవచ్చని అమిత్ షా లా కమిషన్ కు తన లేఖలో పేర్కొన్నారు. ఇక ఈసీ తాజా ప్రకటనతో మోదీ ప్రభుత్వం ప్రతిపాదించిన ఎన్నికల సంస్కరణ సాధ్యం కాదనే చెప్పవచ్చు!