Home రాజకీయాలు బాబు సర్కార్‌కు హైకోర్టు షాక్… పథకంపై స్టే

బాబు సర్కార్‌కు హైకోర్టు షాక్… పథకంపై స్టే

296
SHARE

చంద్రబాబు ప్రభుత్వానికి హైకోర్టు షాక్ ఇచ్చింది. చంద్రబాబు తన అత్త బసవతారకం పేరు మీద ప్రవేశపెట్టిన పథకంపై కోర్టు స్టే విధించింది. ఆగస్టు 15న బసవతారకం బాలింత కిట్ పథకాన్ని చంద్రబాబు ప్రారంభించాల్సి ఉంది. అయితే ఈ పథకంలో అక్రమాలు జరిగాయని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.

అక్రమాలు కళ్లెదుట కనిపించడంతో పథకం అమలుపై హైకోర్టు స్టే ఇచ్చింది. ఈ పథకం కింద ప్రభుత్వ ఆస్పత్రిల్లో ప్రసవించే బాలింతలకు ఒక చీర, ఒక రంగు, 40 శానిటరీ పాడ్స్ ఇవ్వనున్నారు.   ఈ కిట్ల సరఫరాకు పిలిచిన టెండర్లలో భారీగా అక్రమాలు జరిగాయి. ఒక్కో కిట్‌ను వెయ్యి   35 రూపాయలకు సరఫరా చేసేలా ఒకరికి కాంట్రాక్టు అప్పగించారు.

అయితే ఇంతకంటే తక్కువ ధరకే కిట్లు సరఫరా చేస్తామంటూ మరో కంపెనీ టెండర్లు దాఖలు చేసింది. అదే కంపెనీ ఎల్‌వన్‌గా వచ్చింది. కానీ చంద్రబాబు ప్రభుత్వం మాత్రం తక్కువ ధరకు కిట్‌ సరఫరాకు ముందుకొచ్చిన కంపెనీని తోసేసి తనకు కావాల్సిన వారికే టెండర్ కట్టబెట్టింది. దీని వల్ల ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లింది.

దీంతో ఎల్‌వన్‌గా వచ్చిన కంపెనీ హైకోర్టును ఆశ్రయించింది. ఏపీలో వైద్య ఆరోగ్య శాఖ ప్రభుత్వం చంద్రబాబు ఆధీనంలోనే ఉంది. ఒక చిన్న పథకంలోనూ అవినీతి చేయకుండా వదిలిపెట్టలేదంటే ఇక భారీ ప్రాజెక్టుల్లో అవినీతి ఏస్తాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.