Home రాజకీయాలు సోమ్‌నాథ్ చటర్జీకి ఏపీతో మంచి అనుబంధం

సోమ్‌నాథ్ చటర్జీకి ఏపీతో మంచి అనుబంధం

111
SHARE

మరో రాజకీయదిగ్గజం కన్నుమూసింది. సీనియర్‌ రాజకీయవేత్త, కమ్యూనిస్టు యోధుడు సోమ్‌నాథ్ చటర్జీ కన్నుమూశారు. 89ఏళ్ల సోమనాథ్‌ కోల్‌కతాలోని ఒక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. భారత రాజకీయ వ్యవస్థపై సోమనాథ్‌ ప్రత్యేకమైన ముద్రవేశారు.

1968లో సీపీఎంలో చేరిన చటర్జీ పదిసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2004 నుంచి 2009 మధ్య లోక్‌సభ స్పీకర్‌గా పనిచేశారు. 2008లో యూపీఏ ప్రభుత్వానికి సీపీఎం మద్దతు ఉపసంహరించినప్పటికీ ఆయన స్పీకర్‌ పదవికి రాజీనామా చేసేందుకు ఒప్పుకోకపోవడంతో పార్టీ నుంచి ఆయన బహిష్కరణకు గురయ్యారు.

సోమనాథ్‌ చటర్జీకి ఆంధ్రప్రదేశ్‌ నేతలతోనూ ప్రత్యేకమైన అనుబంధం ఉండేది. మార్గదర్శి కుంభకోణం సమయంలో రామోజీరావుకు అండగా నిలిచిన వారిలో సోమ్‌నాథ్‌ చటర్జీ కూడా ఒకరు.

రామోజీకి వ్యతిరేకంగా న్యాయపోరాటానికి దిగిన ఉండవల్లి అరుణ్‌కుమార్‌ను సోమ్‌నాథ్‌ స్వయంగా పిలిపించుకున్నారు. రామోజీరావు జోలికి వెళ్లవద్దని కోరారు. ఈ విషయాన్ని ఉండవల్లి అరుణ్‌ కుమారే ఒక ఇంటర్వ్యూలో స్వయంగా వెల్లడించారు. సోమ్‌నాథ్‌ చటర్జీ మరణం దేశ రాజకీయాలకు తీరని లోటే.