Home రాజకీయాలు ఫిల్మ్‌సిటీ వనభోజనాల్లో వైసీపీ గెలుపుపై ఆసక్తికర చర్చ

ఫిల్మ్‌సిటీ వనభోజనాల్లో వైసీపీ గెలుపుపై ఆసక్తికర చర్చ

5541
SHARE

వైసీపీ నేతలు చెబుతున్నట్టు చంద్రబాబు పగలు కాంగ్రెస్, రాత్రి బీజేపీతో ఎంచక్క మేనేజ్ చేస్తున్నట్టుగానే ఉంది. ఒక దినపత్రిక చంద్రబాబు రాజకీయంపై సంచలన కథనాన్ని ప్రచురించింది.
వైఎస్‌ భారతీ పేరును ఈడీ చార్జిషీట్‌లో చేర్చేలా చేయడం వెనుక ఉన్న అసలు కథను వివరించింది.

ఆ పత్రిక కథప్రకారం ఎన్‌డీఏ నుంచి టీడీపీ బయటకు వచ్చినప్పటికీ ఇటీవల ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుతో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా భేటీ తర్వాత పరిస్థితి మారిపోయింది. ప్రస్తుతం ఏపీలో వైసీపీని అడ్డుకోవాలంటే కాంగ్రెస్‌, ఇతర పార్టీలతో జతకట్టకతప్పనిపరిస్థితి ఉందని.. అందుకే ఆ పార్టీతో కలుస్తున్నట్టు చంద్రబాబు బీజేపీ పెద్దలకు మేసేజ్ పంపించారు.

ఎన్నికల తర్వాత తిరిగి ఎన్‌డీఏ గూటికి వస్తామని దూతల ద్వారా చంద్రబాబు బీజేపీ పెద్దలకు సమాచారం అందించారు. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పరిస్థితులను అర్థం చేసుకుని సహకరించాల్సిందిగా చంద్రబాబు కోరారు.

ఈనేపథ్యంలోనే రామోజీ, అమిత్ షాల ఏకాంత భేటీ జరిగింది. ఆ తర్వాతి కొన్ని రోజులకే రామోజీ ఫిల్మింసిటీలో టీడీపీకి అండగానే నిలిచే ఒక సామాజికవర్గం వనభోజనాలు భారీగా నిర్వహించారు. వనభోజనాలకు వచ్చిన కులపెద్దలు రాజకీయ పరిస్థితిపై చర్చించారు.

ఏపీలో వైసీపీతో టీడీపీ ముఖాముఖి తలబడితే   10 శాతం కంటే ఎక్కువ ఓట్లు వైసీపీకి వస్తాయని సర్వేలో తేలినట్టు వనభోజనాలకు వచ్చిన వారికి పెద్దలు వివరించారు. వైసీపీకి 132 స్థానాలు వస్తాయని,టీడీపీకి 28కి మించి వచ్చే పరిస్థితి లేదని వివరించారు. కాబట్టి కాంగ్రెస్‌, ఇతర పార్టీల సాయంతోనే వైసీపీని ఎదుర్కోవాల్సి ఉంటుందని వనభోజనాల పెద్దలు చర్చించుకున్నారు.

ఎన్నికల తర్వాత తిరిగి ఎన్‌డీఏ గూటికి వస్తామని బీజేపీ పెద్దలను చంద్రబాబు ఒప్పించిన తర్వాతే వైఎస్ భారతీపై ఈడీ కేసుల తంతు మొదలైందని వివరించింది.