Home రాజకీయాలు సీఎం పదవికి రూ.20వేల కోట్లు ఇస్తాం…

సీఎం పదవికి రూ.20వేల కోట్లు ఇస్తాం…

SHARE

కాపులను బీసీల్లో చేరుస్తామన్న పవన్‌ కల్యాణ్ ప్రకటనను స్వాగతిస్తున్నట్టు కాపు ఉద్యమ నేత ముద్రగడపద్మనాభం చెప్పారు. కాపు కార్పొరేషన్‌కు చంద్రబాబు 5వేల కోట్లు, జగన్‌ 10 వేల కోట్లు ఇస్తామనడాన్ని ఆయన తప్పుపట్టారు.

కాపు జాతిని డబ్బుకు అమ్ముడుపోయే జాతిగా మార్చవద్దన్నారు. తామే 20 వేల కోట్లు ఇస్తామని ముఖ్యమంత్రి పదవిని కాపులకు ఇవ్వాలని ముద్రగడ డిమాండ్ చేశారు.

రిజర్వేషన్ల బిల్లును కేంద్రానికి పంపి తొమ్మిది నెలలు అవుతున్నా అది ఎందుకు ఆమోదం పొందడం లేదని ప్రశ్నించారు. చంద్రబాబు కాపులకు విస్తరి వేశారని.. కానీ కూరలు మాత్రమే వడ్డించి అన్నం పెట్టకుండా వదిలేశారన్నారు.

జగన్మోహనరెడ్డి మాత్రం కాపు రిజర్వేషన్ల అంశం తన పరిధిలో లేదని, 50శాతం రిజర్వేషన్లు దాటకూడదని రాజ్యాంగాన్ని చదివినట్టుగా ప్రకటనలు ఇవ్వడం బాధ కల్గించిందన్నారు.