Home రాజకీయాలు లోకేష్ కు ఉచిత సలహా ఇచ్చిన జన సేనాని!

లోకేష్ కు ఉచిత సలహా ఇచ్చిన జన సేనాని!

119
SHARE

జనసేనాని పవన్ కళ్యాణ్ ఏపీ ఐటీ శాఖామంత్రి లోకేష్ కు క్లాస్ పీకారు. ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు లా వెన్నుపోటు రాజకీయాలు చేయొద్దని లోకేష్ కు సలహా ఇచ్చారు.

లోకేష్ తన తండ్రి అయిన చంద్రబాబు నాయుడు ని ఆదర్శంగా తీసుకోరాదనీ పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఒక్కో నియోజకవర్గానికి నలభై కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ ఆయా నియోజకవర్గాలను కైవసం చేసుకోవాలంటే అది కుదరదని కూడా పవన్ స్పష్టం చేశారు.

వెన్నుపోటు రాజకీయాలు మా కుటుంబానికి అలవాటు అని లోకేష్ అ౦టే, అనుకుంటే సరిపోదని పవన్ తెలిపారు. ఈ వెన్నుపోటు రాజకీయాల వల్లే తన చివరి రోజుల్లో ఎన్టీఆర్ నరక యాతన పడ్డారన్నారు. ఎదురుగా వచ్చి కౌగిలించుకొని వెనుకనుంచి పొడుస్తామంటే…..పడేవాళ్లు లేరన్నారు.

ప్రజాసమస్యల గురించి మాట్లాడుతుంటే లోకేష్ నన్ను తిట్టిస్తున్నారు….నా తల్లిని అనకూడని మాటలు అనిపించారు. ఒక్కసారి మీ అమ్మగారిని అడగండి అంటూ లోకేష్ కు సలహా ఇచ్చారు.