Home రాజకీయాలు మాఫియాకు అండగా… నరసరావుపేటలో ఉద్రిక్తత

మాఫియాకు అండగా… నరసరావుపేటలో ఉద్రిక్తత

325
SHARE

టీడీపీ గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్‌ అక్రమ మైనింగ్ ప్రకంపలను సృష్టిస్తోంది. అక్రమ మైనింగ్‌ ద్వారా వేల కోట్లదోపిడిపై ఇటీవల హైకోర్టు తీవ్రంగా స్పందించింది.

వ్యవస్థలు కళ్లుమూసుకున్నాయని వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో అధికారులు తూతూ మంత్రంగా దర్యాప్తు చేసి యరపతినేనిని తప్పించి 2009లో చనిపోయిన వ్యక్తులు అక్రమ మైనింగ్ చేశారంటూ కేసులు పెట్టి విస్మయానికి గురిచేశారు.

ఈ నేపథ్యంలో వైసీపీ నిజనిర్థారణ కమిటీ మైనింగ్ ప్రాంతంలో పర్యటించేందుకు సిద్ధమవగా పోలీసులు అడ్డుకున్నారు. గురజాల నియోజవకర్గాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారు. అటువైపు వైసీపీ నేతలెవరూ వెళ్లకుండా పోలీసులు కాపు కాస్తున్నారు.

మైనింగ్ ప్రాంతానికి వెళ్లేందుకు సిద్ధమైన వైసీపీ నేతలు కాసు మహేష్, గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి తదితరులను హౌజ్ అరెస్ట్ చేశారు. గోపిరెడ్డికి చెందిన ఆస్పత్రి వద్ద కూడా ఆంక్షలు విధించారు పోలీసులు. అక్రమ మైనింగ్ జరుగుతున్న ప్రాంతానికి వెళ్లేందుకు అనుమతి ఇచ్చే ప్రసక్తే లేదని పోలీసులు చెబుతున్నారు. వందలాది మంది వైసీపీ కిందిస్థాయి నాయకులు, కార్యకర్తలకు నోటీసులు జారీ చేశారు.