Home రాజకీయాలు ఎమ్మెల్యే సీటుకు జేసీ ప్రభాకర్ రెడ్డి గుడ్‌బై

ఎమ్మెల్యే సీటుకు జేసీ ప్రభాకర్ రెడ్డి గుడ్‌బై

497
SHARE
వచ్చే ఎన్నికల్లో తాను ఎమ్మెల్యేగా పోటీచేయడం లేదని ప్రకటించారు టీడీపీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి. తాడిపత్రి నుంచి వచ్చే ఎన్నికల్లో తన కుమారుడు అశ్మిత్ రెడ్డిని బరిలో దింపుతామని ప్రకటించారు.
తాడిపత్రి శివారులోని పెన్నాబిడ్జి వద్ద నూతనంగా ఏర్పాటు చేస్తున్న పార్కు శంకుస్థాపన కార్యక్రమానికి హాజరైన జేసీ ప్రభాకర్ రెడ్డి…  తన కుమారుడిని కూడా ఆదరించాలని ప్రజలను కోరారు. తనపై చూపిన ప్రేమ, అనురాగాన్ని తన కుమారుడు అశ్మిత్ రెడ్డిపైనా చూపాలన్నారు.
తాడిపత్రి అభివృద్ధిలో తనను మించి తన కుమారుడు పనిచేస్తారని హామీ ఇచ్చారు. తాను మాత్రం రాబోయే ఎన్నికల్లో తాడిపత్రిలో కౌన్సిలర్‌గా పోటీ చేస్తానని చెప్పారు. తనకు తాడిపత్రి ప్రజలే బలం, బలహీనత అని ప్రభాకర్ రెడ్డి చెప్పారు. కౌన్సిలర్‌గా  తాడిపత్రి ప్రజల  సేవకు అంతకితమవుతానన్నారు.
తన తండ్రి , తన పెదనాన్న పేరు నిలబెట్టేందుకు కృషి చేస్తానని అశ్మిత్ రెడ్డి చెప్పారు. తన తండ్రి ఆశయం మేరకు భవిష్యత్తులో తాడిపత్రిలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని నిర్మిస్తామని అశ్మిత్ రెడ్డి ప్రకటించారు.