Home రాజకీయాలు “ఇంకెంత కాలం పోలీస్ బలం తో గొంతునొక్కుతావు బాబు??”

“ఇంకెంత కాలం పోలీస్ బలం తో గొంతునొక్కుతావు బాబు??”

201
SHARE

ఏపీ సీఎం చంద్రబాబు పై విపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మండిపడ్డారు. గుంటూరు జిల్లా గురజాలలో మైనింగ్ కుంభకోణాన్ని పరిశీలించడానికి తమ పార్టీ వారి నిజనిర్ధారణ కమిటీ వెళ్తే వారిని అక్రమంగా అరెస్ట్ చేశారని జగన్ ఆరోపిస్తూ….ఆ అక్రమ అరెస్టులు బాబు తప్పును కప్పిపుచ్చటానికే అంటూ ట్వీట్ చేశారు.

కేవలం బాబు తన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి 144 సెక్షన్ అమలు లో పెట్టారని అన్నారు. చంద్రబాబు అక్రమాలు, కుంభకోణాలు బయట పడకుండా ఉండడానికి ఆయనకు వ్యతిరేకంగా పైకి లేస్తున్న గొంతులు నులిమేయడానికి ఇంకా ఎంత కాలం పోలీసుల అండ తీసుకుంటారని జగన్ తన ట్వీట్ లో ప్రశ్నించారు.

మరోపక్క గురజాలలో అక్రమ మైనింగ్ జరుగుతున్న ప్రాంతాలను పరిశీలించేందుకు వైసీపీ నేతలు వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని పార్టీ నేతలు అంబటి రాంబాబు, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, కాసు మహేష్ రెడ్డి మండిపడ్డారు. వైసీపీ నేతలను గృహ నిర్బంధం చేయడం తగదని వారన్నారు.

అక్రమ మైనింగ్ పై నిజానిజాలు ప్రజలకు తెలియాల్సివుందని అన్నారు. అసలీ నిజనిర్ధారణ కమిటీ పర్యటన అంటే ప్రభుత్వానికి ఎందుకు భయం అని ప్రశ్నించారు. పార్టీ సీనియర్లతో కలిసి అక్రమ క్వారీలను పరిశీలిస్తామని, ఎట్టి పరిస్థితుల్లో వెనుకడుగు వేసే ప్రసక్తి లేదని వైకాపా నేతలు అన్నారు.