Home రాజకీయాలు నల్లారి ఫోన్‌ అంటే బూతులు వినాల్సిందే…

నల్లారి ఫోన్‌ అంటే బూతులు వినాల్సిందే…

141
SHARE

మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌ రెడ్డి సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డి తీరు అధికార వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఆయన వేధింపులు భరించలేక పలువురు అధికారులు లీవ్‌పై వెళ్లిపోతున్నారు.

ఫోన్‌ చేసి ఇష్టానుసారం మాట్లాడడం, బూతులు తిట్టడం వంటివి చేస్తుండడంతో పీలేరు నియోజకవర్గంలో పనిచేసేందుకు అధికారులు సాహసించడం లేదు. కిషోర్‌ నుంచి ఫోన్ వచ్చిందంటే బూతులు ఖాయమన్న అభిప్రాయం అధికారుల్లో ఏర్పడింది.

టీడీపీలో చేరినప్పటి నుంచి పీలేరును తన సొంత రాజ్యంగా భావిస్తున్నారు నల్లారి కిషోర్‌. కలికిరి మండలంలో చుక్క భూములు అధికంగా ఉండడంతో వాటిని తేల్చేపనిలో రెవెన్యూ అధికారులు ఉండగా.. కిషోర్ కుమార్ రెడ్డిపదేపదే ఫోన్లు చేసి ఆ భూములను తన అనుచరుల పేరు మీదకు మార్చేయాలని చేయాలని ఆదేశిస్తున్నారు.

కలికిరి గ్రామ పరిధిలోని సైనిక్ స్కూల్ వద్ద ఉన్న ఖరీదైన చుక్కల భూమిని తన అనుచరుడికి ఇచ్చేయాలని తహసీల్దార్‌కు నేరుగా ఫోన్ చేసి కిషోర్ హెచ్చరించారు. అయితే అలా ఇవ్వడం కుదరదని రెండుమూడుసార్లు తహసీల్దార్‌ తేల్చిచెప్పారు. దీంతో ఆగ్రహంచిన కిషోర్ కుమార్‌ రెడ్డి తహసీల్దార్‌ను బూతులు తిట్టారు. నీ అంతు చూస్తా. ప్రభుత్వం మాది. వెంటనే లీక్‌ పెట్టి వెళ్లిపో. లేదంటే అంతు చూస్తా అంటూ వార్నింగ్ ఇచ్చారు.

ఈ విషయాన్ని జిల్లా ఉన్నాతాధికారి దృష్టికి తహసీల్దార్ తీసుకెళ్లగా.. ”చూసుకుని పోవాలి” అంటూ సలహా ఇవ్వడంతో తహసీల్దార్‌ కంగుతిన్నారు. తహసీల్దార్‌ నెల రోజుల సెలవుపై వెళ్లిపోయారు. కొన్నాళ్ల క్రితం పీలేరు ఎంపీడీఓ వసుంధరమ్మకు ఫోన్ చేసిన కిషోర్ కుమార్ రెడ్డి, తాను చెప్పిన వారికే పించన్లు ఇవ్వాలని, అలా చేయని పక్షంలో తీవ్ర పరిణామాలుంటాయని ఆమెను హెచ్చరించారు.

వైసీపీ సానుభూతిపరులకు ఇళ్లు ఎలా కేటాయిస్తారంటూ హౌసింగ్ ఏఈ సదాశివాను కూడా కిషోర్ కుమార్‌ రెడ్డి దూషించినట్టు చెబుతున్నారు. డీఆర్‌డీఏ వెలుగు ఏపీఎంను కూడా పిలిపించుకుని మరీ బూతులు తిట్టి పంపించారు కిషోర్ కుమార్ రెడ్డి. దీంతో ఏపీఎం కూడా సెలవు దారి పట్టారు.