Home రాజకీయాలు “రైలు దహనం తర్వాత అన్ని జిల్లాల్లో కాపులను అరెస్ట్ చేసినప్పుడేమైయ్యారు?”

“రైలు దహనం తర్వాత అన్ని జిల్లాల్లో కాపులను అరెస్ట్ చేసినప్పుడేమైయ్యారు?”

SHARE

ముద్రగడ పద్మనాభం పై వైకాపా సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు విరుచుకుపడ్డారు. కాపుల పై యూ టర్న్ తీసుకుని తమ అధినేత జగన్ ను విమర్శించడం సరికాదు అని వైసీపీ ఎమ్మెల్సీ అన్నారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ ఉమ్మారెడ్డి కాపు ఉద్యమంపై ముద్రగడ పద్మనాభం ఎందుకు యూ టర్న్ తీసుకోవలసి వచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు.

తునిలో మీటింగ్ పెట్టినప్పుడు ఓ లక్ష మంది వచ్చారు…సామాజికవర్గ ప్రయోజనాల కోసం ముద్రగడ పోరాటానికి మద్దతిచ్చాం అని గుర్తు చేశారు. కడప నుంచి మనుషులు వచ్చి రైలు తగలబెట్టారంటే కూడా ముద్రగడ ఏమీ మాట్లాడలేదని అన్నారు. రైలు దహనం తర్వాత కూడా అన్ని జిల్లాల్లోని కాపులను అరెస్ట్ చేసినప్పుడు కూడా ముద్రగడ మౌనం వహించారని ఉమ్మారెడ్డి గుర్తు చేశారు.

తమ పార్టీ ఆది నుంచీ కాపు ఉద్యమానికి అండగా ఉందని తెలిపారు. ముద్రగడ టీడీపీ తో కుమ్మక్కై కాపు ఉద్యమాన్ని బలహీన పరుస్తున్నారని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ధ్వజమెత్తారు. తాను యూటర్న్ తీసుకుని జగన్ ను విమర్శించడం అత్యంత దారుణమన్నారు.. ముద్రగడ ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు.

జగన్ అన్న మాటలనే మంత్రి యనమల అంటే ముద్రగడ ఎందుకు మౌనం వహించారని ప్రశ్నించారు. ప్రశ్నించాల్సిన ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదని ఉమ్మారెడ్డి మండిపడ్డారు!