Home రాజకీయాలు 2014లో వైకాపా గెలిచేదే…కానీ..: పవన్!

2014లో వైకాపా గెలిచేదే…కానీ..: పవన్!

129
SHARE

పశ్చిమ గోదావరి జిల్లాలో కేవలం జనసేన పార్టీ వల్లే తెలుగు దేశం పార్టీ జిల్లాలో పదిహేను సీట్లు గెలిచిందని పార్టీ అదినేత పవన్ కళ్యాణ్ అన్నారు.

అసలు 2014 లో వై ఎస్ ఆర్ కాంగ్రెస్ ప. గో జిల్లాలో గెలవ వలిసి ఉందని అయితే తమ పార్టీ వల్ల తెలుగుదేశం గెలిచిందని పవన్ అన్నారు. ఇంత జరిగిన తనకు అనుభవం లేదు పరిణితి లేదు అంటూ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అదినేత చంద్రబాబు అంటున్నారని పవన్ పేర్కొన్నారు. ఓట్లు చీలకుండా ఉండడానికి గాను తాను గత ఎన్నికలలో పోటీ పెట్టలేదని పేర్కొన్నారు.

తాను వున్నది ప్రజల సంక్షేమ౦ కోసమని టిడిపి సంక్షేమానికి కాదని ఆ పార్టీ వారు తెలుసుకోవాలని పవన్ అన్నారు. ఇంకా తాను 2014 నుంచి కూడా టీడీపీ చేస్తున్న తప్పుల గురించి చెబుతూనే ఉన్నానని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టి అంతా అమరావతిమేదే అని అక్కడ ఎలా సంపాదించాలి అన్న దానిమీదేనని అంతే కానీ పశ్చిమ గోదావరి జిల్లా యువత కి ఎం చెయ్యాలి అన్న దాని పై లేదని పవన్ కళ్యాణ్ అన్నారు. టిడిపి నేతలు ఎంత విమర్శించినా తాను బంతిలా పైకి లేస్తానని పవన్ పేర్కొన్నారు. కానీ రాజ్యసభ సీట్ల విషయం పై కూడా పవన్ క్లారిటీ ఇవ్వాల్సిందేమో?