Home రాజకీయాలు భాగస్వామిని హత్య చేసి భార్యను బెదిరించింది నీవు కాదా…

భాగస్వామిని హత్య చేసి భార్యను బెదిరించింది నీవు కాదా…

SHARE

గుంటూరు జిల్లా వినుకొండ నియోజవకర్గంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో టీడీపీ కార్యకర్తలు చనిపోయిన అంశం రాజకీయ రంగు పులుముకుంది. రోడ్డు ప్రమాదాన్ని హత్యగా చిత్రీకరించేందుకు టీడీపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఈ వ్యవహారాన్ని వైసీపీ వినుకొండ వైసీపీ ఇన్‌చార్జ్ బొల్లా బ్రహ్మనాయుడిపైకి మళ్లించేందుకే ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ప్రయత్నిస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

ఈ నేపథ్యంలో స్పందించిన వైసీపీ ఇన్‌చార్జ్ బొల్లా బ్రహ్మనాయుడు… టీడీపీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు వచ్చే ఎన్నికల్లో ఓడిపోవడం ఖాయమని తెలుసుకుని..తనపై ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. గ్రామంలో సిమెంట్ రోడ్డు విషయంలో టీడీపీలోని రెండు వర్గాల వారు గొడవపడ్డారని…వారు జీవీ ఆంజనేయులును కలిసేందుకు వస్తూ రోడ్డు ప్రమాదంలో చనిపోయారన్నారు.

ఇందులో తన ప్రమేయం ఎక్కడుందని ప్రశ్నించారు. గతంలో తన వ్యాపార భాగస్వామిగా ఉన్న వ్యక్తిని హైదరాబాద్లో నడిరోడ్డుపై ఆంజనేయులు నరికి చంపించింది నిజం కాదా అని ప్రశ్నించారు. కేసు పెడితే చంపేస్తానంటూ వ్యాపార భాగస్వామి భార్యను కూడా బెదిరిస్తే ఆమె భయంతో ఆస్తులు కూడా వదిలేసి వెళ్లింది నిజం కాదా అని బ్రహ్మనాయుడు ప్రశ్నించారు.

వ్యాపార భాగస్వామిగా ఉన్న నాయిబ్రహ్మణ వ్యక్తిని జీవీ ఆంజనేయులు హత్య చేయించిన విషయం నియోజకవర్గంలోని ప్రజలందరికీ తెలుసన్నారు. హత్యలు, దోపిడీలు, స్మగ్లింగ్‌ చేసి కోట్లు సంపాదించిన వ్యక్తి జీవీ ఆంజనేయులు అని బ్రహ్మనాయుడు చెప్పారు.