Home రాజకీయాలు తుని కేసులన్నీ ఎత్తేస్తాం…

తుని కేసులన్నీ ఎత్తేస్తాం…

SHARE

కాపు ఉద్యమ సమయంలో తునిలో రైలు దగ్దం ఘటనపై వైఎస్‌ జగన్ స్పందించారు. కాపు ఉద్యమ సమయంలో చంద్రబాబే కుట్రపూరితంగా రైలును తగలబెట్టించారని జగన్ ఆరోపించారు. రైలును చంద్రబాబే తగలబెట్టించి కేసులు మాత్రం వైసీపీ వాళ్లపై పెట్టారని మండిపడ్డారు.

ప్రజాసంకల్పయాత్రలో భాగంగా తునిలో జరిగిన బహిరంగసభలో ప్రసంగించిన జగన్… తాము అధికారంలోకి రాగానే తుని ఘటనకు సంబంధించిన కేసులన్నీ ఎత్తివేస్తామన్నారు. తుని ఘటనలో వైసీపీ కార్యకర్తలపై 75 శాతం కేసులు పెట్టారన్నారు. మహిళలు, వికలాంగులపైనా కుట్రపూరితంగా చంద్రబాబు కేసులుపెట్టించారన్నారు.

యనమల రామకృష్ణుడు ఆర్థిక మంత్రిగా ఉన్నా సరే తుని నియోజవకర్గానికి మాత్రం ఏమాత్రం ఉపయోగం లేకుండాపోయిందన్నారు. తునిలో చెత్తవేయడానికి డంపింగ్ యార్డును కూడా ఏర్పాటు చేయలేకపోయారని ఎద్దేవా చేశారు. యనమల వర్గీయులు నియోజకవర్గంలో ఇసుక దోపిడికి పాల్పడుతున్నారన్నారు.నారాయణ, శ్రీచైతన్య కాలేజీలకు దోచిపెట్టేందుకు ప్రభుత్వ కాలేజీలను చంద్రబాబు నిర్వీర్యం చేస్తున్నారని జగన్ ఫైర్ అయ్యారు. తాము అధికారంలోకి రాగానే కాలేజీల ఫీజులు తగ్గిస్తామన్నారు.