Home రాజకీయాలు 51వేల కోట్ల పీడీ అకౌంట్ స్కాం దేశంలోనే అతి పెద్ద స్కాం

51వేల కోట్ల పీడీ అకౌంట్ స్కాం దేశంలోనే అతి పెద్ద స్కాం

SHARE

బీజేపీ నేత …ఆ పార్టీ ఎంపీ జివీఎల్ నరసింహారావు పిడి ఖాతాల స్కాం ని అంత తేలిగ్గా విడిచిపెట్టరు…బాబు ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడుతూ ఏభై ఒక్క వేల కోట్ల రూపాయల మొత్తాన్ని ఎక్కడ …ఎలా… ఖర్చు పెట్టిందీ తెదేపా ప్రభుత్వాన్ని అడుగుతూనే వున్నారు.

అయితే జివీఎల్ కి ఇదెలా సంబంధమని అధికార పార్టీ ఎంఎల్ఏలు అంటూ కాలయాపన చేస్తున్నారు. ఇంతవరకూ ప్రభుత్వం ఎటువంటి వివరణ కూడా ఇవ్వలేదు.

అయితే జివీఎల్ నరసింహారావు ఇది కచ్చితంగా పెద్ద కుంభ కోణమేనని అన్నారు…నిజానికి దేశంలోనే ఇంత భారీ కుంభకోణం ఇంతవరకూ జరగలేదని కూడా అన్నారు. ప్రభుత్వం, టిడిపి నేతలు డబాయించటం కాదని డబ్బు ఎలా ఖర్చు చేశారో,ఎందుకు కాగ్ కు వివరణ ఇవ్వలేకపోయారో ఎందుకు చెప్పడం లేదని ఆయన ప్రశ్నించారు.

గత౦లో దీనిపై కొన్ని సాంపుల్ టెస్ట్ లు జరిగాయని జివీఎల్ అన్నారు. తాను వాస్తవ౦ చెప్తున్నానని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నిండా అవినీతి లో కూరుకు పోయిందని అందులోనూ ఇది అతి పెద్ద స్కామ్ అని జివీఎల్ నొక్కివక్కాణించారు.

నిజంగా అంత పెద్ద స్కాం అన్నపుడు…కేంద్రమే సిబిఐ ఎంక్వయిరీ వేయోచ్చు కదా…అందునా అది కాగ్ రిపోర్ట్ ఆధారంగా కదా…మారేందుకు ఉపేక్షించటం?