Home రాజకీయాలు కామెడీ ‘కరుణ’ సెంటిమెంట్ వర్క్ అవుట్ అవుతుందట..!!

కామెడీ ‘కరుణ’ సెంటిమెంట్ వర్క్ అవుట్ అవుతుందట..!!

SHARE

దీన్నే అంటారేమో అభిమానం వెర్రి తలలు వేయడమంటే.. ఒక నటుడైన…రాజకీయ నాయకుడైనా అభిమాన౦ ఉండొచ్చేమో కానీ అది ఇంతలా వెర్రితలలు వేయకూడదు అని పవన్ కళ్యాణ్ ఫాన్స్ ని చూసి అంనొచ్చు ఎవరైనా!

విషయమేమిటంటే…రానున్న ఎన్నికల్లో జన సేన పార్టీ విజయ దుందుభి మోగిస్తుందని పవన్ ఫాన్స్ ఘంటాపధంగా చెప్తున్నారు. అయితే దానికి వారు చెప్పిన కారణమే కామెడీ గా వుంది. పక్క రాష్ట్రమైన తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి మరణం…ఆయనపై వెలుబుకుతున్న జనాభిమానం చూసి పవన్ ఫాన్స్…తమ నాయకుడు కూడా కరుణ అంతటి వాడౌతాడని చెప్తున్నారు. కరుణానిధి మూడు పెళ్లిళ్లు చేసుకున్నా ఎవరూ…ఆయన్ని అగౌరవంగా చూడలేదు…కాబ్బట్టి పవన్ కళ్యాణ్ కి ఎటువంటి ఇబ్బందులు ఉండవట. అసలు ప్రజలు ఇటువంటి విషయాలు పరిగణలోకి తీసుకోరు కాబట్టే ఇమ్రాన్ ఖాన్ లాంటి అయన పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ గా ఎన్నికయ్యారు అంటున్నారు. కరుణ ని కూడా ఎవరూ ఎన్ని పెళ్లిళ్లు చేసుకున్నా ఎప్పుడూ ఎవరూ అగౌరవపరచలేదని అంటున్నారు. ఇది చూసి పవన్ కూడా సీఎం కావటం ఖాయం అంటున్నారు.

సెంటిమెంట్ కి సిఎం అవుతారా…అందుకు తగ్గ కసరత్తు చేయాలి గాని…!!