Home రాజకీయాలు అశోక్‌బాబుకు చుక్కెదురు…

అశోక్‌బాబుకు చుక్కెదురు…

SHARE

ఏపీ ఎన్‌జీవో అధ్యక్షుడు అశోక్‌బాబుకు మరోసారి ఉద్యోగుల నుంచి సెగ తగిలింది. కొద్ది రోజుల క్రితమే హైదరాబాద్‌లో ఉద్యోగులు ఏకంగా అశోక్‌బాబు అండ్ టీంపై దాడి చేశారు.

చొక్కాలు చించికొట్టి పరిగెత్తించారు. తాజాగా విజయవాడలో కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేయలంటూ ప్రభుత్వ ఉద్యోగులు చేపట్టిన ధర్నాకు అశోక్‌బాబు రాగా.. ఉద్యోగులు భగ్గుమన్నారు. చంద్రబాబు తొత్తు గోబ్యాక్ అంటూ నినదించారు.

ఉద్యమాన్ని దెబ్బతీసేందుకు వచ్చిన చంద్రబాబు ఏజెంట్ అంటూ మండిపడ్డారు. సర్ధిచెప్పేందుకు ప్రయత్నించినా నిర్వాహకులపైనా ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యమద్రోహిని ఎందుకు పిలిచారంటూ నిలదీశారు. కొందరు ఉద్యోగులు అశోక్‌బాబుపై దాడికి ప్రయత్నించారు.

చివరకు ఉద్యోగుల నిరసనతో కంగుతిన్న అశోక్‌బాబు నాలుగు మాటలు మాట్లాడేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇటీవలే అశోక్‌బాబును టీడీపీలో చేరాల్సిందిగా చంద్రబాబు ఆహ్వానించారు. ఆయన పదవికాలం ముగిసిన తర్వాత టీడీపీలో చేరే అవకాశం ఉందంటున్నారు.