Home రాజకీయాలు లోకేశ్ కోసమే తాంత్రిక పూజలు..నిజం: బిజేపీ నేత

లోకేశ్ కోసమే తాంత్రిక పూజలు..నిజం: బిజేపీ నేత

75
SHARE

ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి నారా లోకేశ్ పై బీజేపీ అధికార ప్రతినిధి ఉమామహేశ్వర రావు విమర్శలు గుప్పించారు. విజయవాడ కనకదుర్గ గుడి లో లోకేశ్ కోసం టీడీపీ వారు అర్ధరాత్రి తాంత్రిక పూజలు జరిపించిన మాట నిజమని ఆరోపించారు. అందుకె ఘటనకు సంబంధించి నివేదికను ఇంతవరకూ బయట పెట్టకుండా తెదేపా నేతలు తొక్కిపెట్టారని విమర్శించారు. విజయవాడలో జరిగిన ఓ సమావేశంలో ఉమామహేశ్వర రావు మాట్లాడుతూ ఈ విమర్శలు చేశారు.

చంద్రబాబుకు బీసీ లు అంటే ఇష్టం లేదని అందుకె దుర్గగుడి పాలక మండలి సభ్యురాలు సూర్యలతను తొలగించారని మండిపడ్డారు. అలానే తాంత్రిక పూజలు నిర్వర్తించిన ఆలయ ఈవో సూర్యకుమారికి తెలుగు దేశం ప్రభుత్వం మంచి పోస్టు ఇచ్చి గౌరవించింది ఎద్దేవా చేశారు.

బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు రూ.100 కోట్ల అవినీతికి పాల్పడ్డారని చెబుతున్న తెదేపా నేతలు ఆ ఆరోపణలపై కట్టుబడి ఉంటే ధైర్యంగా సీబీఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తే దాడులు చేయిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి భాజపా నేతలు కూడా తాంత్రిక పూజలు లోకేష్ కోసం చేసారని చేస్తున్న ఆర్పణలు నిరూపించుకోగలరా?