Home రాజకీయాలు జివీఎల్ పై బుద్ధ వెంకన్న సంచలన ఆరోపణలు!

జివీఎల్ పై బుద్ధ వెంకన్న సంచలన ఆరోపణలు!

SHARE

బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు తెదేపా కి కాల్లో ముల్లులా తయారైన విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు తెదేపా పై జీ వీ ఎల్ విరుచుకుపడుతుండటం పార్టీ లోని ప్రతి ఒక్కరు ఆక్షేపిస్తున్నారు. అయితే తెదేపా నేత బుద్ధ వెంకన్న మాత్రం ఆక్షేపణ తో సరిపెట్టకుండా భాజపా ఎంపీ పై సంచలనమైన ఆరోపణలు గుప్పించారు.

ఆయన ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ, జీవీఎల్ పై చేసిన వ్యాఖ్యల కు తాను కట్టుబడి ఉన్నట్టు చెప్పారు. జీవీఎల్ కు వందల కోట్లు ఆస్తులున్నాయని, ఆయన అవినీతి బయటపెట్టేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కూడా అన్నారు. జీవీఎల్ ఆస్తులు ఏ రూపంలో ఉన్నాయో చెబుతామని, తాను చేసిన ఆరోపణలు నిరూపించలేకపోతే ఏపీ వదిలి వెళ్లిపోతానని కూడా బుద్ధా వెంకన్న సవాల్ విసిరారు.

ఎందుకు ఈ ముసుగు లో గుద్దులాట…తెలిస్తే బయటపెట్టాడని బుద్ధ వెంకన్న గారి ఎం ఆవుతోందో?